పవన్‌ చూపు మళ్లీ సినిమా వైపు!

పవన్‌ చూపు మళ్లీ సినిమా వైపు!

రాజకీయాలా, సినిమాలా అని ఖచ్చితంగా తేల్చుకోలేకపోతోన్న పవన్‌కళ్యాణ్‌ అటో కాలు, ఇటో కన్ను వేస్తూ కానిచ్చేస్తున్నాడు. ఆమధ్య పూర్తిగా సినిమా మనిషి అయిపోయిన పవన్‌ ఆ తర్వాత మళ్లీ రాజకీయాలతో బిజీ అయి సినిమా పనులు పక్కన పెట్టేసాడు. దీంతో అసలు నటించేది వుందా లేదా అనుకున్నారు కానీ పింక్‌ రీమేక్‌ అయితే చేస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌కి వస్తానని చెప్పి, దిల్‌ రాజుని సన్నాహాలు చేసుకోమని చెప్పేసాడు.

అలాగే క్రిష్‌ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి కూడా పవన్‌ ఫిక్స్‌ అయ్యాడు. ఆ చిత్రం షూటింగ్‌ కూడా త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు. తన ధ్యాస మళ్లీ ఇటు తిరిగిందని తెలియజేస్తూ ప్రతిరోజూ పండగే బృందానికి, అల వైకుంఠపురములో బృందానికి పూల బొకేలు పంపించి హాండ్‌ రిటెన్‌ సందేశాలతో కంగ్రాట్స్‌ చెప్పాడు. సినిమాల మూడ్‌లో లేకపోతే పవన్‌ ఇంత త్వరగా ఒక సినిమా గురించి స్పందించడు.

దీనిని బట్టి పవన్‌ ఇక సినిమా మూడ్‌లోకి వచ్చేసాడని ఫాన్స్‌ డిస్కస్‌ చేసుకుంటున్నారు. అయితే పింక్‌ రీమేక్‌ చేయడం పట్ల మాత్రం చాలా మంది హ్యాపీగా లేరు. ఈ చిత్రం చేయమంటూ పవన్‌కి సలహా ఇచ్చింది తానే అంటోన్న త్రివిక్రమ్‌ని కూడా వాళ్లు తిట్టుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English