త్రివిక్రమ్‌-తారక్‌ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి వాటా!

త్రివిక్రమ్‌-తారక్‌ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి వాటా!

ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఖరారయిందనే సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో విడుదలయిన రోజే తారక్‌ ఆ చిత్రాన్ని పొడిగేస్తూ ట్వీట్స్‌ వేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై వున్న అనుమానాలేమైనా వుంటే పటాపంచలయ్యాయి. ఇదిలావుంటే అల వైకుంఠపురములో నిర్మాణంలో అల్లు అరవింద్‌కి భాగస్వామ్యం ఇచ్చినట్టుగా ఈ చిత్రానికి హారికి హాసిని 'చినబాబు'తో పాటు నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ కూడా వుంటాడు.

ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌కి వాటా ఇవ్వాలని తారక్‌ ముందే కండిషన్‌ పెట్టాడు. ఎన్టీఆర్‌ పారితోషికం షరా మామూలుగా వుంటుంది కానీ లాభాలని చినబాబు, కళ్యాణ్‌రామ్‌ పంచుకుంటారు. మహేష్‌బాబు ఈ పద్ధతిని ఎప్పట్నుంచో అవలంబిస్తున్నాడు. అయితే అతని సినిమాలకి అతనే నిర్మాతగా వుంటున్నాడు కానీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇన్వాల్వ్‌ చేయడం లేదు. కానీ అల్లు అర్జున్‌, తారక్‌ మాత్రం తమ సొంత సంస్థలని ఎలివేట్‌ చేస్తున్నారు.

ఇకపై తమ సినిమాలకి హోమ్‌ బ్యానర్లకి వాటా కంపల్సరీ అంటున్నారు. ప్రభాస్‌ కూడా ప్రస్తుతానికి ఇదే ఆలోచనలో వున్నాడు. మరి చరణ్‌ కూడా తన సంస్థని ఇలా ఇన్వాల్వ్‌ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English