అల... డామినేషన్‌ మొదలయింది

అల... డామినేషన్‌ మొదలయింది

సరిలేరు నీకెవ్వరు అతి భారీ చిత్రం కాగా, కమర్షియల్‌గా దానికంటే కాస్త వెయిట్‌ తక్కువయిన అల వైకుంఠపురములో క్లాస్‌ సినిమా కూడా కావడంతో ఆ మాస్‌ మసాలా ముందు తేలిపోతుందని అనుకున్నారు. నిజానికి సరిలేరుకి ముందు రావడానికి భయపడి అల వైకుంఠపురములో ఒక రోజు ఆలస్యంగా విడుదల చేసారు.

తీరా రెండు సినిమాలలోను త్రివిక్రమ్‌ సినిమాకే ఎక్కువ మార్కులు పడడంతో పండగ ముందు పగ్గాలు అల వైకుంఠపురములో చేతికి వెళ్లిపోయాయి. అల వైకుంఠపురములోకి రెండవ రోజే అయినా కానీ సోమవారం మామూలుగా వసూళ్లు తగ్గుతాయి. కానీ సరిలేరు నీకెవ్వరు సోమవారం వెనుకంజ వేయగా, అల వైకుంఠపురములో డ్రైవింగ్‌ సీట్లోకి వచ్చింది. రేపు సాయంత్రం నుంచి మొదలయ్యే పండగ సందడి మూడు రోజుల పాటు సాగుతుంది.

ఈ సమయంలో మళ్లీ సరిలేరు నీకెవ్వరు మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారు. అయితే పబ్లిక్‌ టాక్‌ పరంగా అల వైకుంఠపురములోకి అడ్వాంటేజ్‌ వుంది. ఈ చిత్రం సీడెడ్‌లో కూడా హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అవుతూ వుండడంతో మాస్‌ కూడా దీనిని ఆదరించేసినట్టే ట్రేడ్‌ వర్గాల వారు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English