అంత మంచి పనేనంటారా?

అంత మంచి పనేనంటారా?

రెండు భారీ చిత్రాలు సంక్రాంతికి విడుదల కావడంతో సినీ ప్రియులు ఫుల్‌ బిజీ అయిపోయారు. పండగ టైమ్‌లో వచ్చిన రెండు సినిమాలనీ ఎగబడి చూసేస్తున్నారు. ఈ రెండు సినిమాల సందడిలో రెండు రోజులు ముందుగా విడుదలైన 'దర్బార్‌' థియేటర్లలో జనం లేరు.

అల వైకుంఠపురములో హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం, సరిలేరు నీకెవ్వరు టాక్‌ కూడా ఆశాజనకంగానే వుండడంతో సంక్రాంతి వెళ్లే వరకు ఈ రెండు సినిమాలతోనే సినీ ప్రియులు ఆక్యుపై అయిపోతారు. వచ్చిన ప్రతి సినిమా చూసేసే వర్గం మినహా మిగతా చిత్రాలపై ఇప్పుడు ఎక్కువ మందికి ఆసక్తి లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో సంక్రాంతి రోజున రాబోతున్న కళ్యాణ్‌రామ్‌ సినిమా 'ఎంత మంచివాడవురా' పరిస్థితి ఏమవుతుందంటూ ట్రేడ్‌లో చర్చించుకుంటున్నారు.

పండగ వరకు రెండు సినిమాలకీ థియేటర్లు తగ్గించే పరిస్థితి లేదు. అల వైకుంఠపురములోకి అయితే షోలు పెంచేస్తున్నారు. అతి తక్కువ థియేటర్లలో విడుదలయ్యే 'ఎంత మంచివాడవురా' ఎంతో మంచి టాక్‌ తెచ్చుకున్నా కానీ ఎక్కువ లాభపడేది వుండదు. స్క్రీన్లు, షోలు తక్కువ వున్నా కానీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా చాలా మామూలుగా వుండడంతోనే సిట్యువేషన్‌ ఎలా ఉంటుందనేదానిపై ఒక అంచనాకి వస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English