మినిమం బజ్ లేదు.. సినిమా ఏమవుతుందో?

మినిమం బజ్ లేదు.. సినిమా ఏమవుతుందో?

సంక్రాంతికి షెడ్యూల్ అయిన భారీ చిత్రాల్లో ఏదో ఒకటి దెబ్బ తినకుండా పోదని.. పైగా వాటికి, తన సినిమాకు గ్యాప్ ఉంది కాబట్టి ఇబ్బందేమీ ఉండదని అనుకున్నాడు కళ్యాణ్ రామ్. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' రేసులో ఉన్నా ధీమాగా తన సినిమాను సంక్రాంతి రేసులో నిలబెట్టాడు. కానీ అతడి అంచనాలు ఫలించలేదు. ఆ రెండు సినిమాలూ బాగానే ఆడుతున్నాయి. 'సరిలేరు..' ఎబోవ్ యావరేజ్ టాక్‌తోనే వసూళ్ల మోత మోగిస్తోంది.

'అల..'కు అదిరిపోయే టాక్ రావడంతో బ్యాంగ్ బ్యాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్ సినిమా జోరు కొంచెం తగ్గొచ్చు కానీ.. డౌన్ అయ్యే అవకాశాలైతే లేవు. సంక్రాంతికి ఈ రెండు సినిమాల మీదే ముందు నుంచి ఫోకస్ ఉంది. రిలీజ్ తర్వాత కూడా వాటి మీదే అందరి దృష్టీ నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో 'ఎంత మంచివాడవురా' సంగతి ఏమవుతుందా అన్న ఆందోళన నెలకొంది.

ముందు నుంచి కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అసలు డిస్కషనే లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ను పిలిపించినప్పటికీ.. బజ్ ఏమీ రాలేదు. ఈలోపు సంక్రాంతి భారీ చిత్రాల సందడి మొదలైపోయింది. అవి రెండూ ఇరగాడేస్తుండగా.. కళ్యాణ్ రామ్ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ అయినా వస్తాయా అన్నది సందేహంగా మారింది. ఆ చిత్రానికి థియేటర్లు కూడా ఏ మేర దక్కుతాయా అన్నది సందేహమే.

పెద్ద చిత్రాలు బాగా ఆడుతుండగా.. వాటిని ఖాళీ చేసి పెద్దగా బజ్ లేని సినిమాకు థియేటర్లు ఇవ్వడం కష్టమే. అసలు కళ్యాణ్ రామ్ కాస్త చూసుకుని ఉండాల్సిందని.. సంక్రాంతి రేసులో నిలవాల్సింది కాదని నందమూరి అభిమానులే అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఏమంత ఆసక్తికరంగా లేకపోవడంతో బజ్ పెరగలేదు. మరి ఈ బుధవారం సంక్రాంతి రోజు రిలీజవుతున్న సినిమాకు టాక్ ఎలా ఉంటుందో.. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో.. సినిమా ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English