సినిమా సూప‌ర్ బావా.. థ్యాంక్యూ బావా

సినిమా సూప‌ర్ బావా.. థ్యాంక్యూ బావా

టాలీవుడ్ స్టార్ హీరోలు మునుపెన్న‌డూ లేని స్నేహ భావాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు ఒక‌రి సినిమాల వేడుక‌ల‌కు ఇంకొక‌రు అతిథిగా రావ‌డం.. ఒక‌రినొక‌రు పొగుడుకోవ‌డం.. సినిమాలు హిట్ట‌యిన‌పుడు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు చెప్ప‌డం చూస్తూనే ఉన్నాం. ఈ కోవ‌లోనే తాజాగా అల్లు అర్జున్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభినంద‌న‌లు చెప్పాడు. బ‌న్నీ కొత్త సినిమా అల వైకుంఠ‌పుర‌ములో ఆదివార‌మే రిలీజై సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ నుంచి సినిమా గురించి పాజిటివ్‌గా స్పందిస్తూ ట్వీట్ వేసిన ప్ర‌ముఖుల్లో ఎన్టీఆర్ ఒక‌డు. ట్విట్ట‌ర్ ద్వారా బ‌న్నీకి కంగ్రాట్స్ చెబుతూ.. అత‌ణ్ని బావా అని తార‌క్ సంబోధించ‌డం విశేషం. ప్ర‌తిగా బ‌న్నీ సైతం అదే పిలుపుతో కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం విశేషం.

అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో బ‌న్నీ ఎఫ‌ర్ట్ లెస్.. టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడ‌ని.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న ర‌చ‌నా ప‌ఠిమ‌ను చూపించాడ‌ని.. ఈ సినిమా చూడ‌టం ప్రేక్ష‌కుల‌కు ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌ని తార‌క్ అన్నాడు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీని బావా అని.. త్రివిక్ర‌మ్‌ను స్వామీ అని సంబోధించాడు తార‌క్. ముర‌ళీ శ‌ర్మ పెర్ఫామెన్స్ గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన తార‌క్.. త‌మ‌న్ సంగీతాన్ని, పి.ఎస్.వినోద్ ఛాయాగ్ర‌హ‌ణాన్ని కూడా పొగిడాడు.

దీనికి బ‌దులిస్తూ బ‌న్నీ ట్వీట్ వేశాడు. థ్యాంకూ సోమ‌చ్ బావా.. నీతో మాట్లాడ‌టం చాలా ఆనందాన్నిచ్చింది. త్వ‌ర‌లోనే క‌లుద్దాం అని బ‌న్నీ పేర్కొన్నాడు. మొత్తానికి సోష‌ల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ వీళ్లిద్ద‌రినీ బావా బామ్మ‌ర్దులు అంటుండ‌గా.. నిజంగానే ఆ పిలుపుతో సంబోధించుకుని వాళ్ల‌కు మ‌రింత కంటెంట్ ఇచ్చారు తార‌క్, బ‌న్నీ.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English