రజనీ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు

రజనీ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు

రజనీకాంత్ ‘సూపర్ స్టార్’ హోదాకు ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చి పడింది. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనూహ్యమైన పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒకప్పుడు రజనీ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా భారీగా ఓపెనింగ్స్ తెచ్చుకునేవి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే పదుల కోట్లు వచ్చి పడేవి. రజనీ డిజాస్టర్ సినిమాకు వచ్చిన ఫుల్ రన్ వసూళ్లు.. దక్షిణాదిన మిగతా స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాల వసూళ్ల కన్నా ఎక్కువ ఉండేవి అంటే అతిశయోక్తి కాదు.

అలాంటిది గత మూణ్నాలుగేళ్లలో రజనీ మార్కెట్ దెబ్బ తింటూ వెళ్తోంది. అదే సమయంలో వేరే స్టార్లు మార్కెట్, రేంజ్ పెంచుకుంటున్నారు. ముందు అంతరం తగ్గింది. ఆ తర్వాత చాలామంది రజనీతో సమమయ్యారు. ఇప్పుడు రజనీ వెనుకబడిపోగా.. వేరే స్టార్లు ఆయన్ని దాటి ముందుకెళ్లిపోయారు.

ప్రస్తుతం తమిళంలో విజయ్, అజిత్ ఇద్దరూ రజనీని దాటేశారు. వాళ్ల సినిమాలకే రజనీ చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఇంతకుముందు తమిళ సినిమాలకు సంబంధించి ఏ ఏరియాల్లో అయినా అత్యధిక వసూళ్ల జాబితా తీస్తే రజనీ సినిమాలే వరుసగా కనిపించేవి. కనీసం టాప్-5 వరకు ఆయన ఆక్రమించేసేవారు. కానీ ఇప్పుడు రజనీ సినిమాలు కిందికెళ్లిపోయి విజయ్, అజిత్ చిత్రాలు పైన కనిపిస్తున్నాయి.

గత రెండేళ్లలో వచ్చిన ‘కాలా;’ పేట’.. తాజాగా వచ్చిన ‘దర్బార్’ రజనీ పతనానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈ సినిమా ఈ సినిమా ఫుల్ రన్లో అన్ని భాషల్లో కలిపి వంద కోట్ల మార్కును కూడా అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. తొలి రోజు వసూళ్లు బాగున్నా.. ఆ తర్వాత మేజర్ డ్రాప్ కనిపించింది. తమిళంలో సినిమా ఓ మోస్తరుగా ఆడుతోంది కానీ.. తమిళనాడు అవతల ‘దర్బార్’ ప్రభావం కనిపించడం లేదు.

బయ్యర్లకు ఈ చిత్రం నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా సినిమా సినిమాకూ రజనీ రేంజ్ పడిపోతుండటం, వేరే హీరోలు ఆయన్ని మించి ఎదిగిపోతుండటం తట్టుకోలేకపోతున్న రజనీ ఫ్యాన్స్.. ఆయన ఇక రిటైరైపోతే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English