చిరుపై అశ్వినీదత్ తీవ్ర విమర్శలు

చిరుపై అశ్వినీదత్ తీవ్ర విమర్శలు

మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ నిర్మాత అశ్వినీదత్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్ల కలయికలో  ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఇంద్ర’ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. దత్ అంటే చిరు ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తారు. ఇద్దరూ రాజకీయాల్లో భిన్న ధ్రువాల్లో ప్రయాణించారు కానీ.. వ్యక్తిగతంగా స్నేహం మాత్రం కొనసాగింది.

గతంలో ఒక పర్యాయం ఎన్నికల బరిలో నిలిచిన అశ్వినీదత్‌కు చిరు మద్దతు ప్రకటించడం గమనార్హం. ఐతే దత్ మొదట్నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండగా.. చిరు తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నేళ్ల ప్రయాణం తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు ఇద్దరూ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఇలాంటి సమయంలో చిరు మీద అశ్వినీదత్‌తో తీవ్ర అసహనానికి గురవుతూ విమర్శలు చేయడం గమనార్హం.

ఇందుక్కారణం ఇటీవల ఏపీ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల ఆలోచనకు చిరు మద్దతు ప్రకటిస్తూ ప్రెస్ నోట్ ఇవ్వడమే. దీనిపై తాజాగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో అశ్వినీదత్ తీవ్రంగా స్పందించారు. చిరుకు ఏం తెలుసని మూడు రాజధానుల ప్రతిపాదనపై మాట్లాడారని.. దానికి మద్దతిచ్చారని దత్ ప్రశ్నించారు.

ఓ పక్క పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడుతున్నారని.. అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని పోరాడతున్నారని.. అక్కడి రైతులకు మద్దతుగా నిలుస్తున్నారని.. ఇలాంటి సమయంలో చిరంజీవి వచ్చి మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలకడం ఎంతమాత్రం సరికాదని దత్ అన్నారు. మరి చిరు మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలకడంపై రెండుగా చీలిపోయిన మెగా అభిమానులు అశ్వినీదత్ కామెంట్ల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English