రజనీ రేంజ్‌ బాగా పడింది

రజనీ రేంజ్‌ బాగా పడింది

'దర్బార్‌' చిత్రానికి మొదటి రోజు డీసెంట్‌ స్టార్ట్‌ లభించింది కానీ రజనీకాంత్‌ స్టార్‌డమ్‌ ఎంతగా డ్రాప్‌ అయిందనేది ఈ చిత్రం ఓపెనింగ్‌ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రానికి కబాలి, 2.0కి వచ్చిన ఓపెనింగ్‌ కూడా రాలేదు. తమిళ స్టార్లలో విజయ్‌ ప్రతి సినిమాకీ కొత్త రికార్డు పెడుతోంటే రజనీకాంత్‌ ఈసారి కూడా విజయ్‌ రికార్డుని బ్రేక్‌ చేయలేదు.

ప్రస్తుతం ఓపెనింగ్‌ పరంగా మొదటి మూడు స్థానాల్లోను విజయ్‌ సినిమాలే వున్నాయి. దర్బార్‌ చిత్రానికి మురుగదాస్‌ జత కలిసినా కానీ రికార్డ్‌ రాలేదు. ఈ చిత్రానికి వచ్చిన టాక్‌ కూడా అంత గొప్పగా లేదు. రజనీకాంత్‌ స్టయిల్స్‌ మీదే ఆధారపడిపోయిన మురుగదాస్‌ కథ, కథనాలపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో థియేటర్లలోకి స్ట్రాంగ్‌ అపోజిషన్‌ వస్తే దర్బార్‌కి కష్టాలు తప్పవు.

తెలుగు రాష్ట్రాలలో అయితే రెండవ రోజునే కలక్షన్లలో డ్రాప్‌ బాగా కనిపించింది. ఇక రేపట్నుంచి సరిలేరు నీకెవ్వరు, ఆదివారం నుంచి అల వైకుంఠపురములో సందడి మొదలయితే దర్బార్‌ పరిస్థితి ఎలాగుంటుందనేది తెలియదు మరి. ఏదేమైనా రజనీకాంత్‌ హవా అయితే బాగా తగ్గిపోయింది. ఆయనని అభిమానించే వారు మొదటి రోజు బారులు తీరుతున్నారు కానీ ఆ తర్వాత థియేటర్లలో నిలబెట్టే సినిమాలని దర్శకులు అందించలేకపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English