ప్రయోగాలు కష్టమనేసిన మహేష్

ప్రయోగాలు కష్టమనేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ మరీ రొటీన్ సినిమాలు చేయడు. అలాగని మరీ కొత్తగా, ప్రయోగాత్మకంగానూ సినిమాలు ఎంచుకోడు. కాస్త మధ్యస్థంగా నడిచిపోతుంటాడు. ఐతే 'రంగస్థలం' తరహాలో వైవిధ్యమైన సినిమాలు చేస్తే మహేష్‌ను జనాలు బాగానే చూస్తారనే అభిప్రాయం ఉంది. కానీ మహేష్ మాత్రం ప్రయోగాలంటే కుదరదని అంటున్నాడు.

 తన లాంటి హీరోల సినిమాలంటే పెట్టుబడులు భారీగా ఉంటాయని.. బయ్యర్ల క్షేమం కూడా చూసుకుని సినిమాలు చేయాల్సి ఉంటుందని.. కాబట్టి ప్రయోగాల విషయంలో కాస్త చూసుకుని చేయాల్సి ఉంటుందని మహేష్ అన్నాడు.

"ప్రయోగాలు చేద్దామని అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అన్ని వేళలా సాధ్యం కాదు. పెద్ద హీరోలంతా విచిత్రమైన జోన్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే ప్రయోగాలు చేయకూడదు. వందల కోట్లతో సినిమాలు తీస్తున్నపుడు అన్ని హంగులూ, ప్రేక్షకులు ఆశించే అంశాలు ఉన్నాయో లేదో చూసుకుని చేసుకోవాలి. అదే సమయంలో కొత్తదనం ఉండకూడదని నేననను. కచ్చితంగా అది ఉండాలి. కొత్తదనం ఉంటూనే కమర్షియల్‌గానూ వర్కవుట్ అయ్యే సినిమాలు ఓకే. లేదంటే బయ్యర్లు నష్టపోతారు" అని మహేష్ అభిప్రాయపడ్డాడు.

ఇంతకీ మిగతా హీరోల మాదిరి పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు చేస్తారని మహేష్‌ను అడిగితే.. "దక్షిణాది సినిమాలు పెద్ద స్థాయికి వెళ్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఆడుతున్నాయి. సరిహద్దుల్ని చెరిపేస్తూ విజయాన్నందుకుంటున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలు హిందీలోనూ నిరూపించుకున్నాయి. మంచి కథ వస్తే నేను కూడా తప్పకుండా పాన్ ఇండియా సినిమా చేస్తా" అని మహేష్ చెప్పాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English