మహేష్ స్టేట్మెంట్.. సుక్కుకు పంచా?

మహేష్ స్టేట్మెంట్.. సుక్కుకు పంచా?

‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్ బాబు.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా మీద కొన్ని నెలల పాటు వర్క్ జరిగాక క్యాన్సిల్ అయింది. మహేష్‌కు సుక్కుకు టాటా చెప్పేసి ఉన్నట్లుండి అనిల్ రావిపూడి సినిమాను లైన్లో పెట్టాడు. ఐతే సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడు, అందులోనూ ‘రంగస్థలం’ మైల్ స్టోన్ మూవీ తర్వాత మహేష్‌తో సినిమా చేయడానికి ముందుకొస్తే.. అది చేయడం మానేసి, అనిల్ రావిపూడి లాంటి రొటీన్ డైరెక్టర్‌తో సినిమా చేయడం కరెక్టేనా అన్న చర్చ నడిచింది.

కానీ మహేష్ మాత్రం ఇంకోలా ఆలోచించాడు. సుకుమార్ సినిమాకు కొత్త లుక్ కోసం చాలా కష్టపడాలి. చాలా డేట్లు ఇవ్వాలి. ఇంకా కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ సినిమాను క్యాన్సిల్ చేస్తే తక్కువ సమయంలో అనిల్ సినిమాను పూర్తి చేసి భారీగా పారితోషకం అందుకోవచ్చు. వెంటనే ఇంకో సినిమాను లైన్లో పెట్టుకోవచ్చు అని ఆలోచించినట్లు గుసగుసలు వినిపించాయి.

ఏదైతేనేం సుక్కు సినిమాను కాదని మహేష్ అనిల్ సినిమాను ఓకే చేశాడు. సుక్కు ఏమో బన్నీని చూసుకున్నాడు. ఐతే సుక్కు సినిమాను వదిలిపెట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ చేయడం సరైన నిర్ణయమా కాదా అన్నది ఈ సినిమా రిలీజ్ తర్వాత.. సుక్కు-బన్నీ సినిమా వచ్చాక కానీ తెలియదు. కానీ ఈలోపు మహేష్ అలాంటి సందేహాలేమీ పెట్టుకోవద్దని.. తాను తీసుకున్నది సరైన నిర్ణయమే అని సంకేతాలిచ్చాడు. ‘సరిలేరు..’ చేయాలనుకోవడం తన కెరీర్లోనే బెస్ట్ డెసిషన్ అని మహేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.

పరోక్షంగా సుక్కు చిత్రాన్ని వదులుకోవడం తప్పేమీ కాదని మహేష్ స్టేట్మెంట్ ఇస్తున్నట్లే ఉంది. ఇది ఒక రకంగా సుక్కుకు పంచ్ అని కూడా చెప్పొచ్చేమో. మరి నిజంగా మహేష్ అన్నట్లు ఇది బెస్ట్ డెసిషనా కాదా అనే విషయంలో కొంత క్లారిటీ రావాలంటే ‘సరిలేరు..’ రిలీజవ్వాలి. ఆ తర్వాత సుక్కు సినిమా కూడా వస్తే పూర్తి స్పష్టత వస్తుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English