బాలయ్యతో కుదరలేదు.. చిరు ఊ అంటే ఎంతసేపు?

బాలయ్యతో కుదరలేదు.. చిరు ఊ అంటే ఎంతసేపు?

‘పటాస్’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత ‘సుప్రీం’ లాంటి మీడియం రేంజ్ సినిమా చేశాడు. వరుసగా రెండు సినిమాలూ మంచి విజయం సాధించడంతో ‘రాజా ది గ్రేట్’తో మాస్ రాజా రవితేజను డైరెక్ట్ చేసి ఇంకో మెట్టు ఎక్కాడు. అది సక్సెస్ కావడంతో ఆపై ‘ఎఫ్-2’ ప్రమోషన్ అందుకుని విక్టరీ వెంకటేష్‌ను డైరెక్ట్ చేశాడు. అది బంపర్ హిట్ కావడంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. అదే.. సరిలేరు నీకెవ్వరు.

ఇంకో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మహేష్‌నే డైరెక్ట్ చేశాక.. తర్వాతి సినిమాను అనిల్ ఎవరితో చేస్తాడన్నది ఆసక్తికరం. మహేష్‌ను మించిన స్టార్ అంటే వెంటనే మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తాడందరికీ. పైగా ‘సరిలేరు..’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా వచ్చి అనిల్ మీద ప్రశంసలు కురిపించాడు చిరు.

మరి చిరుతో సినిమా చేసే ప్రయత్నమేదైనా చేస్తున్నారా అని అనిల్‌ను అడిగితే.. ఆయన ఊ అనాలే కానీ సినిమా చేయడం ఎంత సేపు అనేశాడు. చిరు కోసం ఏ కథా అనుకోలేదని.. కానీ ఆయన తనతో సినిమా చేయడానికి ఓకే అంటే మూణ్నాలుగు నెలల్లో స్క్రిప్టు రెడీ చేసి ఆయన ముందు పెడతానని అనిల్ ధీమాగా చెప్పాడు.

మరోవైపు నందమూరి బాలకృష్ణతో ఒక టైంలో అనిల్.. ‘రామారావు’ అనే సినిమా చేస్తాడని ఓ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రస్తావిస్తే.. బాలయ్యతో సినిమా కోసం ప్రయత్నించిన మాట వాస్తవమే అన్నాడు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వర్కవుట్ కాలేదన్నాడు. ఇంతకీ ఫ్యూచర్ ప్రాజెక్టుల మాటేంటి అని అడిగితే ఇంకా ఏమీ తేల్చుకోలేదన్నాడు. ‘ఎఫ్-2’ సీక్వెల్ చేయాల్సి ఉందని.. ఈలోపు ‘ఎఫ్-2’ బాలీవుడ్ రీమేక్‌ను డైరెక్ట్ చేయమని అడుగుతున్నారని.. ఇంకా ఏదీ తేల్చుకోలేదని అన్నాడు అనిల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English