ఫ్లాష్ బ్యాక్ రజనీని చూస్తామా?

ఫ్లాష్ బ్యాక్ రజనీని చూస్తామా?

నాలుగేళ్ల ముందు వరకు సూపర్ స్టార్ రజనీ సినిమా రిలీజవుతోందంటే ఆ క్రేజే వేరుగా ఉండేది. తెలుగు ప్రేక్షకులు సైతం ఆయన సినిమా కోసం వెర్రెత్తిపోయేవాళ్లు. మన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలు రిలీజైనపుడు ఎలాంటి హంగామా కనిపించేదే.. టికెట్ల కోసం ఎలాంటి డిమాండ్ ఉండేదో రజనీ సినిమాకు కూడా అవే పరిస్థితులుండేవి. రజనీని తెరపై చూడటానికి తహతహలాడిపోయేవాళ్లు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

గురువారం రజనీ సినిమా ‘దర్బార్’ రిలీజవుతుంటే ఏమాత్రం హడావుడి కనిపించడం లేదు. తొలి రోజు చాలా షోలకు బుకింగ్స్ సరిగ్గా జరగక ఖాళీగా కనిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా రావడానికి ముందు రెండు రోజులు ఖాళీ దొరకడంతో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న థియేటర్లు, స్క్రీన్లన్నింటిలో ‘దర్బార్’ను నింపేస్తున్నారు. కానీ ఈ సినిమా అడ్వాంటేజీని పెద్దగా ఉపయోగించుకునేట్లు కనిపించడం లేదు.

వరుస ఫ్లాపులు ఎంతటి హీరోనైనా బలహీనపరుస్తాయనడానికి రజనీ కూడా మినహాయింపు  కాలేకపోయాడు. ఐతే మురుగదాస్ లాంటి మేటి దర్శకుడితో రజనీ చేసిన ‘దర్బార్’పై ఇప్పటికి అంచనాలు పెద్దగా లేకపోయినా.. సినిమాకు టాక్ బాగుంటే రిలీజ్ తర్వాత పుంజుకుంటుందేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐతే బ్యాడ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా పరిస్థితి దయనీయంగా మారుతుంది.

తెలుగులో రెండు భారీ చిత్రాలు లైన్లో ఉన్న నేపథ్యంలో సినిమా బాలేదనో, పర్వాలేదనో అంటే మాత్రం శనివారం నుంచి దీన్ని పరిస్థితి దయనీయంగా మారుతుంది. మరి ‘దర్బార్’లో ఒకప్పటి రజనీని చూస్తామా.. జనాల్ని ఆయన ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్తారా.. సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. రెండు రోజుల్లో ఏమేర వసూళ్లు సాధిస్తుంది.. అని అంతా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు, యువి క్రియేషన్స్ వాళ్లు కలిసి రిలీజ్ చేస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English