సమంత ఫ్యాన్స్ హర్టు

సమంత ఫ్యాన్స్ హర్టు

పెళ్లయ్యాక సమంత కెరీర్‌కు తెరపడుతుందని అనుకుంటే.. మరో స్థాయికి వెళ్లింది. ఇంతకుముందులా వరుసగా ఆమె భారీ చిత్రాలు చేస్తుండకపోవచ్చు. కానీ కంటెంట్ పరంగా గొప్ప గొప్ప సినిమాల్లో నటిస్తోంది. వాటిలో సమంత పాత్రలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి.

‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యు టర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’.. ఇలా గత రెండేళ్లలో సామ్ చేసిన ప్రతి సినిమా, ప్రతి పాత్రా ప్రత్యేకమైనవే. ఈ కోవలోనే ఆమె కొత్త సినిమా ‘జాను’ కూడా కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తమిళ క్లాసిక్ ‘96’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో త్రిషకు ఎంతో గొప్ప పేరు తెచ్చిపెట్టిన పాత్రను తెలుగులో  సమంత చేస్తోంది. తమిళ వెర్షన్‌కు భిన్నంగా తెలుగులో హీరోయిన్ పేరు మీదే ‘జాను’ అనే టైటిల్ పెట్టారు.

ఈ టైటిల్‌ను ఖరారు చేస్తూ తాజాగా ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. ఐతే హీరోయిన్ పేరు మీద టైటిల్ పెట్టి.. హీరోయిన్ లేకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జనాలకు పెద్ద షాక్. సమంత అభిమానులైతే ఫస్ట్ లుక్ చూసి బాగా నిరుత్సాహపడ్డారు. బలమైన హీరోయిన్ పాత్ర ఉన్న సినిమా.. పైగా హీరోయిన్ పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టినపుడు.. సమంతను డివైన్ లుక్‌లో చూపిస్తూ.. ఆమెను హైలైట్ చేసేలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనుకుంటే.. ఆమె బదులు హీరో ముందు ఒంటెల్ని పెట్టడమేంటో జనాలకు అర్థం కాలేదు. అసలిందులో హీరో శర్వానంద్‌ను కూడా సరిగా చూపించలేదు.

ఐతే ‘96’ను తమిళంలో అద్భుతంగా మలిచిన దర్శకుడు ప్రేమ్ కుమార్.. తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఏదో కన్వే చేయాలనుకుంటున్నాడని.. త్వరలోనే సమంత లుక్ రిలీజ్ చేయకుండా పోరని.. కాబట్ట ఎదురు చూడాలని ఇంకొందరంటున్నారు. ఇకపోతే ఈ ఎడారి.. ఒంటెలు.. అక్కడ హీరో.. ఈ సెటప్ అంతా చూస్తే తమిళంతో పోలిస్తే తెలుగులో కథను కొంచెం మారుస్తున్న భావన కలుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English