కెజిఎఫ్‌ కాదు... ఇది ఉఫ్‌!

కెజిఎఫ్‌ కాదు... ఇది ఉఫ్‌!

కన్నడ సినిమానుంచి వచ్చిన 'కెజిఎఫ్‌' తెలుగు, హిందీ భాషలలో కూడా మంచి కలక్షన్లు రాబట్టింది. అలాగే 'ఏఎస్‌ఎన్‌' అంటే 'అతడే శ్రీమన్నారాయణ' కూడా పాన్‌ ఇండియా సినిమా అవుతుందని అనుకున్నారు. ట్రెయిలర్‌ కట్‌ చేసినపుడు నిజంగానే ఈ చిత్రంలో ఏదో వుందనిపించారు. కానీ రిలీజ్‌కి దగ్గర పడేకొద్దీ ఎందుకో చల్లబడిపోయారు. డిసెంబర్‌ 27న విడుదల కావాల్సిన చిత్రాన్ని జనవరి 1కి వాయిదా వేసారు.

ఈ చిత్రానికి తెలుగునాట కనీస ప్రచారం జరగలేదు. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఆదరించడం లేదు. చాలా మంది ఈ చిత్రాన్ని బోరింగ్‌ అంటూ కొట్టి పారేయగా, కొందరు మాత్రం ఆహా ఓహో అంటూ బాకాలు ఊదేస్తున్నారు. కన్నడ చిత్ర సీమ నుంచి మరో కెజిఎఫ్‌ అనేస్తున్నారు. కానీ కెజిఎఫ్‌ ఫక్తు మాస్‌ సినిమా కాగా, ఇది దేనికీ కాని రేవడిలా తయారయింది. వెరైటీ సినిమాని అందించాలనే తపనలో ఓవర్‌గా వెళ్లిపోయి ఒక స్పూఫ్‌ సినిమాని తలపించే చిత్రాన్ని తెరకెక్కించారు.

టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌ మెయింటైన్‌ చేసినప్పటికీ మన ప్రేక్షకులని మెప్పించే లక్షణాలు లేని ఈ చిత్రం ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే వ్యూస్‌ కోసం ఎదురు చూడాల్సిందే తప్ప పనిగట్టుకుని థియేటర్లకి వెళ్లినవారు మూడు గంటలకి పైగా సాగే ఈ తంతుని అంత ఈజీగా జీర్ణించుకోలేరు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English