చిరంజీవితో జరిగే పనేనా?

చిరంజీవితో జరిగే పనేనా?

చిరంజీవి నడి అరవైలలో వుండడంతో ఇదివరకటిలా ఆయన చురుగ్గా షూటింగ్‌ చేయలేకపోతున్నారు. ఒక పది రోజులు షూటింగ్‌ చేస్తే వారం రోజులు గ్యాప్‌ తీసుకుంటున్నారు. చిరంజీవి ఆరోగ్య సమస్యల వల్లే 'సైరా' ఆలస్యమయింది. అఖరుకి చిరంజీవి లేకుండా పలు పోరాట దృశ్యాలని డూప్‌లతో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో మొదలు పెట్టిన చిత్రానికి కొరటాల శివ కేవలం ఏడు నెలల సమయం పెట్టుకున్నాడు.

ఆగస్టు 14న విడుదల చేయాలని ప్లాన్‌ చేసుకున్నాడు. నిర్మాణ వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని చరణ్‌కి మాటిచ్చేసాడు. చిరంజీవి రెడీ అయినా కానీ ఆరు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్‌ చేయడం ఆయన వల్ల అయ్యే పనేనా? పైగా కమర్షియల్‌ చిత్రమని చెబుతున్నారు కనుక పాటలు, ఫైట్లు కూడా వుంటాయిగా. ఈ వయసులో చిరంజీవి భారీ ఫైట్లు చేయాలన్నా, తన స్థాయికి తగ్గట్టు డాన్స్‌ చేయాలన్నా అంత ఈజీ కాదుగా?

కొరటాల శివ అయితే ఆగస్ట్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడు కానీ దసరాకి వాయిదా పడుతుందని బాగా వినిపిస్తోంది. ఒకవేళ దసరాకి కుదరకపోతే వచ్చే సంక్రాంతికి వెళ్లినా ఆశ్చర్యం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ మాత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' రిలీజ్‌ డేట్‌తో లింక్‌ అయి వుంటుంది. రెండూ ఒకే సీజన్‌లో అయితే ఖచ్చితంగా రావు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English