ఎఫ్2 సీక్వెల్.. అతణ్ని వదలనంటున్న వెంకీ

ఎఫ్2 సీక్వెల్.. అతణ్ని వదలనంటున్న వెంకీ

గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా 'ఎఫ్-2.' సైరా నరసింహారెడ్డి, సాహో, మహర్షి సినిమాలు దీన్ని మించి వసూళ్లు సాధించి ఉండొచ్చు. కానీ పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే 'ఎఫ్-2'నే బిగ్గెస్ట్ హిట్. పెట్టుబడి మీద రెండున్నర మూడు రెట్ల దాకా ఆదాయం తెచ్చిపెట్టిందీ సినిమా. సంక్రాంతి సీజన్లో మిగతా సినిమాలన్నింటినీ పక్కకు నెట్టి ఈ కామెడీ మూవీ ఎలా వసూళ్ల మోత మోగించిందో గుర్తుండే ఉంటుంది.

బాలీవుడ్లో గోల్ మాల్, హౌస్ ఫుల్ తరహాలో తెలుగులో దీన్ని ఫ్రాంఛైజీగా మార్చాలని దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సినిమా రిలీజైన కొన్ని రోజులకే ప్రకటించారు. 'ఎఫ్-3' పేరుతో దీని సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్లు అనిల్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఐతే సీక్వెల్లో కూడా వెంకీ, వరుణ్‌లే హీరోలుగా నటిస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అనిల్.

ఐతే 'ఎఫ్-2'కు బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా నిలిచిన వెంకీ లేకుండా దీని ఫ్రాంఛైజీ కొనసాగడం అంటే కష్టమే. ఈ తరహా సినిమాల్లో వెంకీలా కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే కామెడీ చేయడానికి మరొక ఆప్షన్ కనిపించరు. కాబట్టి వెంకీ సీక్వెల్లో కొనసాగడం పక్కా. ఆయనతో పాటు వరుణ్ ఉంటాడా.. ఆ స్థానాన్ని ఇంకెవరైనా భర్తీ చేస్తారా అన్నదే చూడాలి. ఐతే వెంకీ మాత్రం 'ఎఫ్-2'కు సీక్వెల్ వస్తే అందులో వరుణ్ కచ్చితంగా ఉంటాడని తేల్చేశాడు.

'ఎఫ్-3' కోసం కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు ఆయన ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను, వరుణ్ కలిసి అనిల్ చెప్పిన కొన్ని లైన్ల మీద డిస్కస్ చేశామని.. 'ఎఫ్-2'ను మంచి కామెడీ ఫ్రాంఛైజీగా మార్చేందుకు బాగా స్కోప్ ఉందని.. ఈ సిరీస్‌లో ఎన్ని సినిమాలైనా చేయొచ్చిన వెంకీ చెప్పాడు. సీక్వెల్లో తాను, వరుణ్ నటిస్తామని.. కానీ హీరోయిన్ల గురించి మాత్రం ఇంకా ఏమీ అనుకోలేదని.. 'అసురన్' రీమేక్ పూర్తయ్యేలోపు దీనిపై క్లారిటీ రావచ్చని వెంకీ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English