హీరో భోంచేశాకే హీరోయిన్ తినాల‌ట‌.. ఎవ‌రా సౌత్ హీరో?

హీరో భోంచేశాకే హీరోయిన్ తినాల‌ట‌.. ఎవ‌రా సౌత్ హీరో?

బాలీవుడ్లో విభిన్న‌మైన‌, బోల్డ్ క్యారెక్ట‌ర్ల‌తో అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన న‌టి రాధికా ఆప్టే. ఆమె కెరీర్ ఆరంభంలో ద‌క్షిణాదిన కూడా సినిమాలు చేసింది. ఐతే సౌత్‌లో త‌న‌తో ప‌ని చేసిన ఒక స్టార్ హీరో త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. అత‌డికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చాన‌ని.. అత‌డితో సినిమా చేసేట‌పుడు నిర్మాత‌లు త‌న ప‌ట్ల చాలా ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రించార‌ని రాధిక ఆరోపించ‌డం సంచ‌ల‌నం రేపింది.

రాధిక చెప్పిన సంకేతాల్ని బ‌ట్టి ఆ హీరో ఎవ‌ర‌నే విష‌యంలో జ‌నాలు కూడా ఒక అభిప్రాయానికి వ‌చ్చేశారు. రాధికి ప‌లుమార్లు ఈ విష‌యాన్ని ఎత్తి చూపించి ప‌రోక్షంగా ఆ హీరో ప‌రువు తీసేసింది. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ హీరోయిన్ ఒక సౌత్ హీరో సినిమా చేస్తున్న‌పుడు ఇబ్బందిక‌ర అనుభ‌వాలు ఎదుర్కొన్న‌ట్లు వెల్ల‌డించింది. ఇప్పుడు కూడా సందేహాలు స‌ద‌రు హీరో మీదికే వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం.

"చాలా ఏళ్ల‌ క్రితం నేను దక్షిణాది సినిమా చేస్తున్నప్పుడు.. నిర్మాతలు ముందు హీరోకే భోజనం ఏర్పాటు చేసేవారు. ఓసారి నేను చాలా ఆకలితో ఉన్నా. హీరో షాట్‌లో ఉన్నారని, కాబట్టి ముందు ఆయనే తినాలని అన్నారు. అది చూసి నేను నవ్వుకున్నా. ఇలాంటి వికారమైన సంఘటనలు నా కెరీర్లో చాలా చూశా" అంటూ ఒక‌ప్పుడు త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది నేహా.

ద‌క్షిణాదిన నేహా చేసిన మూడు సినిమాలూ తెలుగువే. రాధికా విష‌యంలో అనుమానాలు వ్య‌క్త‌మైన హీరోతో నేహా కూడా ఓ సినిమా చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ హీరోను నిర్మాత‌లు ఎలా ట్రీట్ చేస్తార‌న్న‌ది ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు బాగానే తెలుసు. దీంతో నేహాకు చేదు అనుభ‌వం ఎదురైంది ఆ హీరో సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనేనేమో అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English