ఇండస్ట్రీపై కీరవాణి పంచ్ పేలిపోయిందిగా...

ఇండస్ట్రీపై కీరవాణి పంచ్ పేలిపోయిందిగా...

వేదికలెక్కితే భలే ఆసక్తికరంగా మాట్లాడుతుంటాడు దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. సుతిమెత్తగానే చురకలు అంటించడం ఆయనకు అలవాటు. తాజాగా తన చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా, పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అయిన 'మత్తువదలరా' సినిమా సక్సెస్ మీట్లో భాగంగా కీరవాణి పేల్చిన పంచ్ ఇండస్ట్రీలో చాలామందికి చురుక్కుమనిపించింది.

ఈ సినిమాకు సక్సెస్ మీట్ పెట్టడం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ... "మన సినిమా బాగానే ఆడుతోందిగా.. మరి సక్సెస్ మీట్ పెట్టారేంటి" అని కీరవాణి అడగడం విశేషం. మన పరిశ్రమలో బాబు గారూ అంటే హీరో అని ఎలా అర్థం చేసుకుంటామో.. అలాగే సినిమా రిలీజైన వెంటనే సక్సెస్ మీట్ పెడితే ఫ్లాప్ అని అర్థం చేసుకోవాలని కీరవాణి పేర్కొనడం విశేషం. మన ఇండస్ట్రీ పోకడల్ని గమనిస్తే కీరవాణి వ్యాఖ్యలు నిజమే అనిపించకమానదు.

డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాను హిట్ అంటూ తొలి రోజు సాయంత్రానికే సక్సెస్ మీట్ పెట్టి హడావుడి చేసే నిర్మాతలు చాలా మందే ఉన్నారు మన పరిశ్రమలో. కనీసం వీకెండ్ వరకు కూడా ఆగకుండా సక్సెస్ మీట్ ఏంటో అర్థం కాదు. ఒక షో కూడా పూర్తవకుండానే 'సూపర్ హిట్' అని.. 'బ్లాక్ బస్టర్' అని పోస్టర్లు రెడీ చేయడం.. కలెెక్షన్ల ఫిగర్లు ఎక్కువ చూపించి అతి ప్రచారం చేయడం.. సోషల్ మీడియాను హోరెత్తించేయడం మామూలైపోయింది. ఈ పరిణామాలతో జనాలు ఏ సినిమా హిట్టో.. ఏది ఫట్టో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

ఒక స్థాయి హీరోలు, నిర్మాతలు, దర్శకులు సైతం తమ సినిమాల్ని ఇలా ప్రమోట్ చేసుకుంటూ హిట్, సక్సెస్ మీట్ అనే పదాలకు అర్థమే మార్చేశారు. ఈ నేపథ్యంలో కీరవాణి వేసిన పంచ్ ఇండస్ట్రీలో చాలామంది భుజాలు తడుముకునేలా చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English