15 ఏళ్ల కరవు.. ‘కోబ్రా’తో తీరుతుందా?

15 ఏళ్ల కరవు.. ‘కోబ్రా’తో తీరుతుందా?

ఐదేళ్లు కాదు.. పదేళ్లు కాదు.. 14 ఏళ్లకు పైగా విక్రమ్‌కు నిఖార్సయిన హిట్టు లేదు. చివరగా 2005లో వచ్చిన ‘అపరిచితుడు’ అతడి చివరి హిట్. ఆ తర్వాత 14 ఏళ్లలో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడతను. విలన్, మల్లన్న, ఐ, ఇంకొక్కడు లాంటి భారీ చిత్రాలతో పాటు మరే సినిమా కూడా విక్రమ్ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. చివరగా ‘కడరుమ్ కొండాన్’ (మిస్టర్ కేకే) అనే సినిమాతో వచ్చాడు విక్రమ్. ఆ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు.

ఒకప్పుడు రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్లకు గట్టి పోటీ ఇచ్చిన విక్రమ్.. ఇప్పుడు చిన్న చితకా హీరోల ముందు కూడా తేలిపోతున్నాడు. గత పదేళ్లలో అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఇప్పుడిక విక్రమ్ ఆశలన్నీ ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైక్క నోడిగల్’ (అంజలి ఐపీఎస్) లాంటి హిట్ సినిమాలు తీసిన యువ దర్శకుడు అజయ్ జ్నానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా మీదే ఉన్నాయి.

విక్రమ్ రకరకాల అవతారాల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రి లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌‌గానే అనిపించింది. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘కోబ్రా’ అనే టైటిల్ ఖరారు చేశారు. కోబ్రా రూపంలోనే టైటిల్ రూపొందించి.. మధ్యలో ఓ కిరీటం పెట్టారు లోగోలో. ఇదొక మిస్టీరియస్ త్రిల్లర్ అనే సంకేతాలు ఈ టైటిల్ లోగోను బట్టి అర్థమవుతోంది.

ఐతే ఇలా రకరకాల అవతారాల్లో విక్రమ్ కనిపించడం కొత్తేమీ కాదు. అతను ఇలాంటివి చేసి చేసి బోర్ కొట్టించేశాడు. విక్రమ్ అంటే మామూలు సినిమాలా ఉండొద్దని.. కొత్తగా ఏదో చేద్దామని దర్శకులు ప్రయత్నిస్తున్నారు కానీ.. అవేవీ ప్రేక్షకులకు రుచించడం లేదు. మరి ‘కోబ్రా’ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా రిలీజయ్యే సమయానికి విక్రమ్ హిట్టు కొట్టి 15 ఏళ్ల విరామం వచ్చేస్తుంది. మరి ఈ 15 ఏళ్ల కరవు తీరుస్తూ ‘కోబ్రా’ అతడికి విజయాన్నందిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English