కంచెర‌పాలెం త‌ర్వాత ఉమామ‌హేశ్వ‌ర‌ ఉగ్ర‌రూప‌శ్య‌

కంచెర‌పాలెం త‌ర్వాత ఉమామ‌హేశ్వ‌ర‌ ఉగ్ర‌రూప‌శ్య‌

గ‌త కొన్నేళ్ల‌లో తెలుగులో వ‌చ్చిన అత్యంత గొప్ప సినిమాల్లో కేరాఫ్ కంచెర‌పాలెం ఒక‌టి. ఇంత ఒరిజినాలిటీతో తెలుగులో ఓ సినిమా వ‌చ్చి చాలా కాలం అయింది. ఇలా అంద‌రూ కొత్త‌వాళ్లు క‌లిసి చేసిన సినిమా ప్రేక్ష‌కుల‌పై అంత బ‌ల‌మైన ముద్ర వేయ‌డం కూడా అరుదుగా జ‌రుగుతుంటుంది. విశాఖ‌ప‌ట్నం శివార్ల‌లోని కంచ‌ర‌పాలెం అనే ఊరికి వెళ్లి అక్క‌డే కొన్ని నెల‌లు ఉండి.. ఆ ఊరి మ‌నుషుల్నే పెట్టి సినిమా తీసి ఔరా అనిపించాడు కొత్త ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా.

చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడి మ‌న‌సు త‌ట్టిన ఈ చిత్రం అనేక అవార్డులు కూడా గెలిచింది. దీని త‌ర్వాత వెంక‌టేష్ ఎలాంటి సినిమా తీస్తాడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అత‌ను బాహుబ‌లి లాంటి భారీ చిత్రం తీసిన ఆర్కా మీడియా సంస్థ‌లో త‌న కొత్త సినిమాను చేస్తుండ‌టం విశేషం.

బుధ‌వార‌మే ఈ కాంబినేష‌న్లో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరు... ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య‌. టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు.ఈ చిత్ర‌  అనౌన్స్మెంట్ టీజ‌ర్ భ‌లే ఆస‌క్తిక‌రంగా అనిపిస్తోంది. బాహుబ‌లి, కంచెర‌పాలెం మేక‌ర్స్ నుంచి వ‌స్తున్న స్వీట్ రివెంజ్ స్టోరీ అంటూ.. చిన్న గ్లింప్స్ ఇచ్చారు. త‌న‌కు జ‌రిగిన తీర‌ని న‌ష్టం గురించి ర‌గిలిపోతున్న హీరో.. చెప్పులేసుకోమ‌ని అంటే వాణ్ని కొట్టే వ‌ర‌కు చెప్పులేసుకోను అని శ‌ప‌థం చేస్తాడు.

స‌త్య‌దేవ్ లుక్, మిగ‌తా మ‌నుషుల ఆహార్యం చూస్తే మ‌రోసారి వెంక‌టేష్ ఆంధ్రా ప్రాంతంలోని రూట్స్‌లోకి వెళ్తున్న‌ట్లే ఉంది. ఈ క‌థ అర‌కు వ్యాలీలో జ‌రుగుతుంది. హీరో ఒక చిన్న‌ ఫొటో స్టూడియో య‌జ‌మాని. మ‌రోసారి నేటివ్ ట‌చ్‌తో వెంక‌టేష్ మ్యాజిక్ చేయ‌బోతున్న‌ట్లే ఉంది. మంచి టైటిల్ కూడా కుదిరిన ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English