బాల‌య్య అభిమానుల డెడికేష‌నే వేర‌బ్బా..

బాల‌య్య అభిమానుల డెడికేష‌నే వేర‌బ్బా..

నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త సినిమా రూల‌ర్‌కు ఎలాంటి టాక్ వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. క్రిటిక్స్ ఈ చిత్రానికి 1-1.5 మ‌ధ్య రేటింగ్స్ ఇస్తూ పూర్తి నెగెటివ్‌గా రివ్యూలు రాశారు. సినిమా చూసిన జ‌నాలు కూడా సినిమా చెత్త అని తేల్చేశారు. సోష‌ల్ మీడియాలో పూర్తిగా నెగెటివ్ ఫీడ్ బ్యాకే వ‌చ్చింది. ఈ సినిమా క‌లెక్ష‌న్లు కూడా టాక్‌కు త‌గ్గ‌ట్లే ఉన్నాయి. తొలి రోజే సినిమాకు హౌస్ ఫుల్స్ ప‌డ‌లేదు. రెండో రోజు నుంచి థియేట‌ర్లు ఖాళీ అయిపోయాయి. కంటెంట్ ప‌రంగా బాల‌య్య కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఇదొక‌ట‌న‌డంలో సందేహ‌మే లేదు. వ‌సూళ్ల ప‌రంగా కూడా బాల‌య్య కెరీర్లో అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిల‌వ‌బోతుండ‌టం ప‌క్కా.

ఇలాంటి సినిమాకు  బుక్ మై షోలో రేటింగ్ చూస్తే మాత్రం షాక‌వ్వాల్సిందే. తొలి రోజు సాయంత్రానికి 90 శాతం రేటింగ్‌తో రూల‌ర్ జ‌నాల‌కు పెద్ద షాకే ఇచ్చింది. యూజ‌ర్ రివ్యూల‌న్నీ చాలా పాజిటివ్‌గా క‌నిపించాయి. రోజులు గ‌డిచేకొద్దీ రేటింగ్ కొంచెం త‌గ్గింది కానీ.. అయిన‌ప్ప‌టికీ మంగ‌ళ‌వారం నాటికి 77 శాతం రేటింగ్‌తో క‌నిపిస్తోందీ చిత్రం. దాదాపు 20 వేల మంది ఓట్ల ఆధారంగా ఈ రేటింగ్ వ‌చ్చింది.

77 ప‌ర్సంట్ రేటింగ్ అంటే ఇదొక హిట్ సినిమా అనుకోవాలి. మ‌రి ఇంత నెగెటివ్ టాక్ తెచ్చుకుని, వ‌సూళ్లు క‌ర‌వైన సినిమాకు అంత రేటింగ్ ఏంటి అంటే అదంతా బాల‌య్య అభిమానుల డెడికేష‌న్ వ‌ల్లే. త‌మ హీరో మీద అభిమానం మ‌రీ ఎక్కువైన బాల‌య్య అభిమానులు వేలాది మంది ప‌నిగ‌ట్టుకుని పాజిటివ్ రివ్యూలు రాసి, మంచి రేటింగ్స్ ఇవ్వ‌డంతో రూల‌ర్ సినిమా ఇంత మంచి రేటింగ్‌తో జ‌నాల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English