కాజల్‌ హాట్‌ సిగ్నల్స్‌ పంపిస్తోందా?

కాజల్‌ హాట్‌ సిగ్నల్స్‌ పంపిస్తోందా?

కాజల్‌ గ్లామరస్‌గా కనిపించడానికి ఎపుడూ అభ్యంతరం చెప్పలేదు కానీ బాలీవుడ్‌ హీరోయిన్ల మాదిరిగా అందాల ప్రదర్శనకి మాత్రం ఎన్నడూ ఒప్పుకోలేదు. చివరకు తన ఇస్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌ కూడా మిగతా హీరోయిన్లతో పోలిస్తే చాలా పద్ధతిగా వుంటుంది. అలాంటి కాజల్‌ అగర్వాల్‌ సడన్‌గా బికినీలో ఫోటోలు దిగి వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది.

ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అవడంతో కాజల్‌కి అవకాశాలు తగ్గిపోయాయి. మామూలుగా అయితే అవకాశాలు రావని, ఇలా తాను బికినీ ధరించడానికి కూడా సిద్ధమనే సంకేతాలు పంపించడానికే కాజల్‌ ఈ ఫోటోలు షేర్‌ చేసిందనే టాక్‌ బాగా వినిపిస్తోంది. రెగ్యులర్‌గా ఇలాంటివి పోస్ట్‌ చేసే హీరోయిన్లకి అయితే ఈ టాక్‌ ఏమీ వచ్చుండేది కాదు కానీ కాజల్‌ కాబట్టి ఇది మామూలుగా కంటే కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్‌ సంతరించుకుంది. ఇటీవల తమన్నా కూడా మునుపటి కంటే ఎక్కువగా అందాల ప్రదర్శన చేస్తోంది.

ఇటీవల విడుదలైన విశాల్‌ యాక్షన్‌ సినిమాలో తమన్నా ఎంతగా ఎక్స్‌పోజ్‌ చేసిందనేది తెలిసిందే. కాజల్‌కి ఛాన్స్‌ ఇస్తే ఇప్పుడు తాను కూడా అలా యాక్షన్‌లోకి దిగుతుందేమో. ఏదేమైనా సినిమాలున్నా లేకపోయినా ఫాన్స్‌కి సోషల్‌ మీడియా వల్ల ఇలా తమ ఫేవరెట్‌ హీరోయిన్లని తనివి తీరా వీక్షించే వీలయితే చిక్కుతుండడంతో వారి ఆనందానికయితే అవధుల్లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English