బాల‌య్య‌ను బొయపాటే ఆదుకోవాలి

బాల‌య్య‌ను బొయపాటే ఆదుకోవాలి

న‌ర‌సింహ‌నాయుడు సినిమాతో నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ ప‌తాక స్థాయికి చేరుకుంది. కానీ ఆ సినిమా త‌ర్వాత బాల‌య్య ప‌రిస్థితి ఏమైందో కూడా తెలిసిందే. ఏడెనిమిదేళ్ల పాటు నిఖార్స‌యిన హిట్టు లేదు బాల‌య్య‌కు. ఒక‌టీ అరా యావ‌రేజ్‌లు ఉన్నాయి త‌ప్పితే.. మిగ‌తావన్నీ దారుణ‌మైన డిజాస్ట‌ర్లే. బాల‌య్య సినిమా హిట్ట‌యితే షాక‌య్యే ప‌రిస్థితి వ‌చ్చేసింది ఒక ద‌శ‌లో.

యాంటీ ఫ్యాన్స్‌కు బాల‌య్య ఒక కామెడీ పీస్ లాగా అయిపోయాడు. అలాంటి స్థితిలో బాల‌య్య‌ను ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో చూపించి సింహాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించాడు బోయ‌పాటి శ్రీను. అప్పుడు నంద‌మూరి అభిమానుల దృష్టిలో అత‌ను పెద్ద హీరో అయిపోయాడు. అత‌ను వాళ్ల‌కు దేవుడిలా క‌నిపించాడు. ఐతే సింహా విజయాన్ని బాల‌య్య పెద్ద‌గా ఉప‌యోగించుకోలేదు.

ఆ త‌ర్వాత ప‌ర‌మ‌వీరచ‌క్ర‌, అధినాయ‌కుడు, శ్రీమ‌న్నారాయ‌ణ లాంటి పేల‌వ‌మైన సినిమాల్లో న‌టించాడు. శ్రీరామ‌రాజ్యం సంగ‌తి వేరు. దాన్ని మిన‌హాయిస్తే బాల‌య్య చేసిన‌వి చెత్త‌ సినిమాలే. మ‌ళ్లీ ఆయ‌న కెరీర్‌లో ప‌త‌నం క‌నిపించింది. అలాంటి ద‌శ‌లో మ‌ళ్లీ బోయ‌పాటే ఆప‌ద్బాంధ‌వుడ‌య్యాడు. లెజెండ్ సినిమాతో మ‌ళ్లీ బాల‌య్య కెరీర్‌కు ఊపిరి పోశాడు. కానీ బాల‌య్య ఉప‌యోగించుకుంటేనా? ఒక్క గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మిన‌హాయిస్తే బాల‌య్య చేసిన‌వ‌న్నీ మామూలు సినిమాలే.

ఈ ఏడాది అయితే య‌న్.టి.ఆర్, రూల‌ర్ సినిమాల దెబ్బ‌కు కుదేలైపోయాడు నంద‌మూరి హీరో. ఆయ‌న మార్కెట్ దారుణంగా దెబ్బ తినేసి సింహా ముందు రోజుల స్థాయికి చేరుకున్నాడు. దీంతో మరోసారి బాల‌య్య‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త బోయ‌పాటి మీదే ప‌డింది. నంద‌మూరి అభిమానులు మా దేవుడు నువ్వేన‌య్యా అంటూ అత‌డి వైపే చూస్తున్నారు. మ‌రి మూడోసారి కూడా బాల‌య్య‌ను బోయ‌పాటి ఆదుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English