వెంకీ మళ్లీ బిగ్ లీగ్ లోకి?

వెంకీ మళ్లీ బిగ్ లీగ్ లోకి?

విక్టరీ వెంకటేష్‌‌ను ఏడాది ముందు వరకు అటు ఇండస్ట్రీ జనాలు, ఇటు ప్రేక్షకులు లైట్ తీసుకునేవాళ్లు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్-4 స్టార్లలో ఒకడిగా ఉన్న వెంకీ.. గత కొన్నేళ్లలో మిగతా సీనియర్ల లాగే బాగా జోరు తగ్గించేశాడు. సక్సెస్ రేట్, మార్కెట్ బాగా పడిపోగా.. టాప్ లీగ్ డైరెక్టర్లు ఆయనతో పని చేయడం మానేశారు. ఇలాంటి తరుణంలో ‘ఎఫ్-2’ సినిమాతో వెంకీ కెరీర్ భలేగా మలుపు తిరిగింది. ఈ సినిమా ఏకంగా రూ.80 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీకి పెద్ద షాకిచ్చింది.

సరైన సినిమా పడితే వెంకీ ఎలా ప్రేక్షకుల్ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తాడో ఈ సినిమా రుజువు చేసింది. దీని తర్వాత యావరేజ్ కంటెంట్‌తో వచ్చిన ‘వెంకీ మామ’కు సైతం మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే అందుకు ప్రధాన కారణం వెంకీనే. కంటెంట్ పరంగా చాలా వీక్ అయిన ఈ చిత్రాన్ని వెంకీనే తన భుజాలపై నడిపించాడు. ఫుల్ రన్లో ఈ సినిమా బయ్యర్లను బయటపడేసేలాగే కనిపిస్తోంది.

వెంకీలో మునుపటి ఊపు చూస్తున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఆయన వైపు చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టాప్ లీగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. వెంకీతో ఇంతకుముందు అనుకున్న సినిమాను పట్టాలెక్కించడానికి ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్ల కిందటే ఈ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది పట్టాలెక్కలేదు. త్రివిక్రమ్ వెంకీ తర్వాతి తరం బడా స్టార్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మార్కెట్ తక్కువున్న సీనియర్లు, వేరే హీరోల వైపే చూడట్లేదు.

కానీ ఇప్పుడు వెంకీ ఊపు చూసి ఆయనతో సినిమా పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని.. తనకు మాతృ సంస్థ అనదగ్గ హారిక హాసిని క్రియేషన్స్ వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నాడని.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం పట్టాలెక్కొచ్చని అంటున్నారు. త్వరలోనే ‘అసురన్’ రీమేక్‌ను మొదలుపెట్టనున్న వెంకీ.. అదయ్యాక త్రివిక్రమ్‌‌తో సినిమా చేయొచ్చని వార్తలొస్తున్నాయి. చూద్దాం నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ కార్యరూపం దాలుస్తుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English