రంగ‌స్థ‌లంకు ఫిలిం ఫేర్ అవార్డుల పంట‌

రంగ‌స్థ‌లంకు ఫిలిం ఫేర్ అవార్డుల పంట‌

2018 సంవ‌త్స‌రానికి ఫిలిం ఫేర్ అవార్డుల్ని ప్ర‌క‌టించారు. శ‌నివారం రాత్రి చెన్నైలో ఫిలిం ఫేర్ సౌత్ అవార్డుల వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అనుకున్న‌ట్లే ఈ అవార్డుల్లో రంగ‌స్థ‌లం సినిమా హ‌వా సాగింది. ప్ర‌ధాన అవార్డుల్లో చాలా వ‌ర‌కు ఆ సినిమానే సొంతం చేసుకుంది. చిట్టిబాబుగా అద్భుత అభిన‌యం ప్ర‌ద‌ర్శించిన రామ్ చ‌ర‌ణ్ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యాడు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా మాత్రం సుకుమార్ కాకుండా మ‌హాన‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఎంపిక‌య్యాడు.

ప్ర‌ధాన అవార్డుల వివ‌రాలు..

ఉత్త‌మ న‌టుడు-రామ్ చ‌ర‌ణ్ (రంగ‌స్థ‌లం)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - నాగ్ అశ్విన్ (మ‌హాన‌టి)
ఉత్త‌మ న‌టుడు (క్రిటిక్స్)-దుల్క‌ర్ స‌ల్మాన్ (మ‌హాన‌టి)
ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)- ర‌ష్మిక మంద‌న్నా (గీత గోవిందం)
ఉత్త‌మ స‌హాయ‌ న‌టుడు- జ‌గ‌ప‌తిబాబు (అర‌వింద స‌మేత‌)
ఉత్త‌మ స‌హాయ న‌టి- అన‌సూయ భ‌ర‌ద్వాజ్ (రంగ‌స్థ‌లం)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- దేవిశ్రీ ప్ర‌సాద్ (రంగ‌స్థ‌లం)
ఉత్త‌మ గాయ‌కుడు-సిద్ శ్రీరామ్ (గీత గోవిందం)
ఉత్త‌మ గాయ‌ని-శ్రేయా ఘోష‌ల్ (భాగ‌మ‌తి)
ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌-చంద్ర‌బోస్ (రంగ‌స్థ‌లం)
ఉత్త‌మ ఛాయాగ్రాహ‌కుడు-ర‌త్న‌వేలు (రంగ‌స్థ‌లం)
ఉత్త‌మ ఆడియో ఆల్బం- రంగ‌స్థ‌లం

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English