వెంకీమామని సరిగ్గా వాడుకుంటే పండగే!

వెంకీమామని సరిగ్గా వాడుకుంటే పండగే!

వెంకటేష్‌ మళ్లీ మునుపటిలా ప్రేక్షకులని థియేటర్లకి తీసుకొస్తున్నాడు. ఆమధ్య కొన్నాళ్లు వెంకీ హవా తగ్గిపోయిందని అనిపించింది కానీ 'ఎఫ్‌ 2'తో వెంకీ సత్తా ఏమిటో తెలిసింది. 'వెంకీ మామ' చిత్రానికి అంత మంచి ఓపెనింగ్‌ రావడానికి కూడా వెంకీనే కారణం. అయితే ఎఫ్‌2లో మాదిరిగా వెంకటేష్‌ కామెడీని 'వెంకీమామ'లో వాడుకోలేకపోయారు. దాంతో సినిమాకి ఓపెనింగ్స్‌ వచ్చినా కానీ వీక్‌ డేస్‌లో వీక్‌ అవక తప్పలేదు.

కానీ వెంకీమామకి వచ్చిన ఓపెనింగ్‌తో ఒకటయితే ప్రూవ్‌ అయింది. వెంకటేష్‌తో ఇప్పటికీ నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి లాంటి కామెడీ చిత్రాలు ఈ ఏజ్‌కి సూటయ్యేలా చేస్తే కనుక వసూళ్లకి ఏ ఢోకా వుండదు. ఎవరైనా మంచి ఫామ్‌లో వున్న దర్శకుడితో వెంకటేష్‌ జత కడితే ఇప్పటికీ బాక్సాఫీస్‌ పరంగా మ్యాజిక్‌ చేయగల సత్తా వెంకీ మామ సొంతం. ఏజ్‌కి తగ్గ పాత్రలు చేస్తోన్న వెంకటేష్‌ ప్రస్తుతం యువ హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

యువ హీరోతో కలిసి నటించడం వల్ల తానే సినిమా అంతటినీ నడిపించాల్సిన అవసరం వుండట్లేదు. అలాగే కాంబినేషన్‌ క్రేజ్‌ వల్ల సినిమా రేంజ్‌ కూడా పెరుగుతోంది. యువ హీరోలతో కలిసి చేయడానికి మిగతా సీనియర్లు కూడా ప్రయత్నించారు కానీ వెంకటేష్‌ మాదిరిగా కెమిస్ట్రీ అందరికీ వీలవడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English