కాజ‌ల్‌కు విగ్ర‌హం.. ఆ హీరోల ఫ్యాన్స్ హ‌ర్టు

కాజ‌ల్‌కు విగ్ర‌హం.. ఆ హీరోల ఫ్యాన్స్ హ‌ర్టు

మూడేళ్ల కింద‌ట యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు సింగ‌పూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైన‌పు విగ్ర‌హం పెడుతున్నార‌న్న వార్త ఎంత చ‌ర్చ‌నీయాంశ‌మైందో తెలిసిందే. స్వ‌యంగా రాజ‌మౌళే ఈ విష‌యాన్ని చాలా అతిశ‌యంగా చెప్పుకొచ్చాడు. ఇది అరుదైన గౌర‌వం అన్న‌ట్లుగా మాట్లాడాడు. ఈ విగ్ర‌హం పెట్టాక దాన్ నిచూడ‌టం కోస‌మే భీమ‌వ‌రం నుంచి ప్ర‌భాస్ అభిమానులు పెద్ద ఎత్తున సింగ‌పూర్ టూర్ల‌కు వెళ్లిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత సూప‌ర్ మ‌హేష్ బాబుకు సైతం టుస్సాడ్స్ వాళ్లు విగ్ర‌హం పెట్టారు. అప్పుడు కూడా బాగానే హ‌డావుడి న‌డిచింది. దీని గురించి మ‌హేష్ ఫ్యాన్స్ ప్రౌడ్‌గా చెప్పుకున్నారు.

ఆయా స‌మ‌యాల్లో ఈ ఇద్ద‌రు హీరోల అభిమానులు త‌మ స్టార్ల రేంజ్ గురించి గొప్ప‌గా మాట్లాడుకున్నారు. ఈ సంద‌ర్భంగా మిగ‌తా హీరోల్ని త‌క్కువ చేసి మాట్లాడిన అభిమానులు కూడా ఉన్నారు. క‌ట్ చేస్తే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు టుస్సాడ్స్ వాళ్లు మైన‌పు విగ్ర‌హం పెట్ట‌డానికి రెడీ అయిపోయారు. ఆమెతో ఫొటో షూట్ కూడా అయింది.

దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇది ప్ర‌భాస్, మ‌హేష్ అభిమానుల‌కు అంత‌గా రుచించ‌డం లేదు. అప్పుడు ప్ర‌భాస్, మ‌హేష్ అభిమానులు చేసిన హ‌డావుడిని గుర్తు చేస్తూ మిగ‌తా హీరోల ఫ్యాన్స్ ట్రోలింగ్ మొద‌లుపెట్టారు. కాజ‌ల్‌కే విగ్ర‌హం పెడుతున్న‌పుడు ప్ర‌భాస్, మ‌హేష్‌ల‌కు పెట్ట‌డం పెద్ద విష‌య‌మా.. ఇదేమీ అంత పెద్ద గౌర‌వం కాదంటూ వాళ్లు ఎద్దేవా చేస్తున్నారు. దీని మీద ఫ్యాన్ వార్స్ బాగానే న‌డుస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English