బాలయ్య సరసన అంటే.. భయపడిందా?

బాలయ్య సరసన అంటే.. భయపడిందా?

నందమూరి బాలకృష్ణ సరసన సినిమా అంటే హీరోయిన్లు ఎగ్జైట్ అయ్యే రోజులు పోయాయి. ఆయనకు వయసు మీద పడింది. అలాగే ఫాలోయింగ్ పడిపోయింది. ఆయన మీద ట్రోలింగ్ జాతీయ స్థాయి వరకు వెళ్లి బాలయ్య అంటే ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తున్నట్లు ఉంది జనాలకి. అందుకే కాస్త పేరున్న హీరోయిన్లెవ్వరూ బాలయ్యతో సినిమా అంటే ఒప్పుకోవట్లేదు.

పైగా బాలయ్యతో పని చేసిన ఒక ముంబయి భామ ఆయన పేరెత్తకుండా గాలి తీసేసింది. ఇది ఆయన వ్యక్తిత్వానికి కూడా మచ్చగా నిలిచింది. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రతి సినిమాకూ హీరోయిన్ల సమస్య పెద్దదైపోయింది. కాస్త పేరున్న హీరోయిన్వెవ్వరూ ముందుకు రాక.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలోనే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేయబోయే కొత్త సినిమాకు కథానాయికలంటూ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అందులో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా పేరు కూడా ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్ సహా చాలామంది స్టార్లతో ఆమె సినిమాలు చేసింది. ఈమెను బాలయ్య-బోయపాటి సినిమాకు కథానాయికగా కన్సిడర్ చేస్తున్నారంటూ ఒక ప్రచారం మొదలైంది. ఐతే ఇది చూసి ఉలిక్కి పడి సోనాక్షి ఖండన ఇవ్వడం విశేషం. తాను బాలయ్య సరసన సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తన తర్వాతి సినిమాల గురించి తనే స్వయంగా వెల్లడిస్తానని ఆమె స్పష్టం చేసింది.

ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తాను ఒక తెలుగు సినిమాలో నటించడం లేదని పనిగట్టుకుని క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రచారాలు సర్వ సాధారణం. ఐతే ఈ రూమర్ కూడా ప్రచారంలోకి రావడం సోనాక్షికి ఇష్టం లేనట్లుంది. బోయపాటి అసలు సోనాక్షిని సంప్రదించాడో లేదో తెలియదు కానీ.. తనకైతే ఈ సినిమాలో చేసే అవకాశం ఎంతమాత్రం లేదని సోనాక్షి చెప్పకనే చెప్పినట్లుంది ఈ ట్వీట్ ద్వారా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English