వినాయక్‌ వేషాలకి దిల్‌ రాజు బ్రేక్‌

వినాయక్‌ వేషాలకి దిల్‌ రాజు బ్రేక్‌

డైరెక్టర్‌ వినాయక్‌ ప్రధాన పాత్రలో దిల్‌ రాజు ఒక చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్‌ బేస్డ్‌ స్టోరీతో రూపొందే ఈ లో బడ్జెట్‌ చిత్రంలో వినాయక్‌ హీరో అనుకోగానే ఆయన తన సహజమైన అవతారాన్ని చాలించి నిజంగా హీరోలా కనిపించాలని చూసాడు. జిమ్‌కి వెళ్లిపోయి బాగా బరువు తగ్గి, విగ్‌ కూడా ధరించి కనిపించాడు.

వినాయక్‌కి వుండే నేచురల్‌ ఛార్మ్‌ పోయి ఆ విగ్‌తో డిస్కషన్‌ టాపిక్‌ అయ్యాడు. వినాయక్‌ గెటప్‌కి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో దిల్‌ రాజు అతడిని మునుపటి రూపానికి వచ్చేయమని చెప్పాడు. దాంతో వినాయక్‌ ఎక్సర్‌సైజ్‌లు మానేసి మళ్లీ మునుపటిలా లావైపోయాడు. అలాగే విగ్‌లో కనిపించడం మానేసి రెగ్యులర్‌ లుక్‌లోనే కనిపిస్తున్నాడు. సినిమాలోను వినాయక్‌ ఆ పాత్ర వయసుకి తగ్గట్టు ఇలాగే కనిపించాలని, ఎలాంటి అసహజత్వం వుండకూడదని దిల్‌ రాజు చెప్పాడు.

దీంతో వినాయక్‌ ఎప్పటిలా తన కళ గల మొహంతో కళకళలాడుతూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నటించే ఆలోచన వుందా లేదా అనేది ఇంకా తెలియదు కానీ వినాయక్‌ దర్శకత్వానికి అయితే దూరం కాకూడదని డిసైడ్‌ అయ్యాడు. ప్రస్తుతం బాలకృష్ణ కోసం ఒక కథ సిద్ధం చేసే పనిలో అతను, తన రైటర్ల బృందం వున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English