నయనతార ముందు ఆమె నథింగ్‌

నయనతార ముందు ఆమె నథింగ్‌

శేఖర్‌ కమ్ముల ఇంతవరకు కాలేజ్‌ సినిమాలే ఎక్కువ తీసాడు. కుర్రాళ్లకి నచ్చే తన స్టయిల్‌ విడిచి అతను చేసిన లీడర్‌ సరిగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి శేఖర్‌ తన బాణీ మార్చాడు. కహానీ అనే హిందీ థ్రిల్లర్‌ డ్రామాని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నాడు. విద్యాబాలన్‌ ఆ చిత్రంలో అద్భుతంగా నటించి కోట్లకి కోట్లు కలెక్షన్లు వచ్చేటట్టు చేసింది. కహానీకి తన మార్కు ఇంప్రూవ్‌మెంట్స్‌తో అనామిక చేస్తున్న శేఖర్‌ కమ్ముల ఇది ఒరిజినల్‌ని మరిపిస్తుందని అంటున్నాడు. విద్యాబాలన్‌ అంత గొప్పగా నటించినా కానీ ఇందులో నయనతార నటించిన తీరు చూస్తే ఆమె నథింగ్‌ అనిపిస్తుందని కూడా కమ్ముల పేర్కొన్నాడు.

శేఖర్‌ కమ్ములని ఈమధ్య ప్రేక్షక జనం లైట్‌ తీసుకుంటున్నారు. మరీ వన్‌ డైమెన్షనల్‌ డైరెక్టర్‌ అని విమర్శకులు కూడా తేల్చేస్తున్నారు. అందుకే ఇలాంటి స్టేట్‌మెంట్స్‌తో తనలో కూడా ఒక మాస్‌ డైరెక్టర్‌ ఉన్నాడని, ఇంతవరకు చూసిన సినిమాలతో తనని జడ్జ్‌ చేయవద్దని కమ్ముల ఈ విధంగా హింట్స్‌ ఇస్తున్నట్టున్నాడు. అయినా నయనతార ముందు విద్యాబాలన్‌ నథింగ్‌ ఏంటి? కాస్త ఎక్కువైంది డైరెక్టర్‌ గారూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు