రచ్చ దర్శకుడి మాయలో మరో నిర్మాత

రచ్చ దర్శకుడి మాయలో మరో నిర్మాత

రచ్చ మినహా మరో హిట్‌ ఇవ్వని సంపత్‌ నందికి కథ చెప్పడం చాలా బాగా వచ్చట. అతను కథ చెబుతుంటే ఎవరైనా నోరు తెరిచి వినాల్సిందేనట. అతను చెప్పే కథకి ఫిదా అయిపోయి ఏ నిర్మాత అయినా కానీ ఎంతయినా ఖర్చు పెట్టడానికి సరే అంటాడట. ఇటీవల అతను తీసిన సినిమాలు ఫ్లాపయినా కానీ సంపత్‌ నందికి మరో నిర్మాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు.

గోపీచంద్‌తో సంపత్‌ తీసే ఈ చిత్రంలో తమన్నా, దిగంగన కథానాయికలుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి భారీ బడ్జెట్‌ కేటాయించాడు. గోపీచంద్‌ కెరియర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన చిత్రమట. ఇటీవల గోపిచంద్‌ సినిమాలేవీ ఆడకపోయినా, ఇదే కాంబినేషన్‌లో వచ్చిన గౌతమ్‌ నంద చిత్రానికి పెట్టిన ఖర్చు బూడిదలో పోసినట్టయినా కానీ మరోసారి సంపత్‌ నంది అడిగినంత పెట్టే నిర్మాత దొరికాడంటే ఆయన ఎంతగా మాయలో పడిపోయాడనేది అర్థమవుతోంది.

సంపత్‌ నంది ఈ కథని రామ్‌ చరణ్‌ కోసం రాసుకున్నాడు. అయితే ఇప్పుడు చరణ్‌ 'రచ్చ' దర్శకుడితో మరో సినిమా చేసే రేంజ్‌ దాటిపోయాడు కనుక ఆ కథ కొన్ని మార్పులతో గోపిచంద్‌ చేస్తున్నాడు. ఇటీవల తన సినిమాలు ఫ్లాపవుతున్నాయని ఖర్చు తగ్గించాలని డిసైడ్‌ అయిన గోపిచంద్‌ కూడా ఈ చిత్రం వరకు మినహాయింపు ఇచ్చేసాడు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English