ఫ్లాపయినా అతని పని బాగుంది

ఫ్లాపయినా అతని పని బాగుంది

కార్తికేయ గుమ్మకొండకి ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత మళ్లీ హిట్‌ లేదు. ఈ ఏడాదిలోనే అతను నటించిన నాలుగు సినిమాలు ఫ్లాపయ్యాయి. మామూలుగా అయితే ఒక యువ హీరో ఇలాంటి ఫ్లాప్‌ స్ట్రీక్‌ తర్వాత కోలుకోలేడు. కానీ కార్తికేయ మాత్రం వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. గీతా ఆర్ట్స్‌లో తీసే 'చావు కబురు చల్లగా' అనే చిత్రంలో కార్తికేయ హీరోగా నటిస్తున్నాడు.

'బస్తీ బాలరాజు'గా ఒక గుర్తుండిపోయే పాత్రని అందులో అతను చేస్తున్నాడు. ఈలోగా హీరో వేషాలు మాత్రమే కాకుండా ఎలాంటివైనా చేయడానికీ అతను సిద్ధంగా వుంటున్నాడు. గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌గా నటించిన కార్తికేయ త్వరలో అజిత్‌తో శివ తీసే చిత్రంలో కూడా విలన్‌ వేషం వేయబోతున్నాడు. తెలుగులో కూడా మార్కెట్‌ వస్తుందనే ఆలోచనతో కార్తికేయకి ఈ పాత్ర ఆఫర్‌ చేసారు.

అజిత్‌ సినిమాతో తమిళంలో ఎంటర్‌ అయితే అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయి కనుక కార్తికేయ ఆలోచించకుండా ఈ ఆఫర్‌కి ఓకే చెప్పేసాడు. ఒకసారి హీరో అవగానే ఇక మిగతా పాత్రలకి దూరమైపోయే యువ నటులకి కార్తికేయ భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో కూడా తన కంటే సీనియర్‌ హీరోల సినిమాల్లో మంచి పాత్ర అయితే లెంగ్త్‌తో సంబంధం లేకుండా చేసేస్తానని అంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English