బాలకృష్ణకి వారంతా దూరమైపోయారా?

బాలకృష్ణకి వారంతా దూరమైపోయారా?

ఎన్టీఆర్‌ బయోపిక్‌కి సక్సెస్‌ మాట ఎలా వున్నా కానీ మంచి ఓపెనింగ్స్‌ అయితే ఖచ్చితంగా వస్తాయని అంచనా వేసారు. తీరా తొలి భాగం బాగుందనే టాక్‌ తెచ్చుకున్నా కానీ అది ప్రేక్షకులు లేక వెలవెలబోయింది. దాంతో రెండవ భాగాన్ని విడుదల చేయాలా వద్దా అంటూ ఆలోచనలో పడాల్సి వచ్చింది. ఏదో ఒక రకంగా రెండవ భాగం రిలీజ్‌ చేస్తే అది కనీసం రెండు కోట్ల షేర్‌ అయినా రాబట్టలేకపోయింది.

బాలకృష్ణకి జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ అభిమానుల అండదండలుండేవి. అలాంటి ఎన్టీఆర్‌ బయోపిక్‌ని అభిమానులు కూడా విస్మరించడం ఆశ్చర్యపరచింది. అది ఆ ఒక్క సినిమాకే పరిమితం అనుకోవడానికి వీల్లేకుండా రూలర్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో జనం లేకపోవడం డైహార్డ్‌ ఫాన్స్‌ని షాక్‌ చేసింది. భారీ స్థాయిలో జనం పోటెత్తుతారని భావించిన విశాఖ ఈవెంట్‌కి ఆశించిన దాంట్లో ఇరవయ్యవ వంతు కూడా జనం రాకపోవడం చిత్ర బృందానికి కూడా షాకిచ్చింది.

చూస్తోంటే ట్రెడిషినల్‌ నందమూరి అభిమానులు బాలయ్యకి దూరమయ్యారనే భావన కలుగుతోంది. రూలర్‌ చిత్రానికి నామ మాత్రపు క్రేజ్‌ కూడా లేకపోవడం ఇందుకు కారణమా, లేక నిజంగానే బాలయ్యకి క్రేజ్‌ తగ్గిందా? బోయపాటితో చేస్తోన్న సినిమాకి కూడా ఇలా స్పందన లేని పక్షంలో బాలయ్య హవా తగ్గిపోయిందని భావించవచ్చునేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English