మహేష్‌, బన్నీ ఇద్దరికీ సూపర్‌హిట్‌ సెట్టింగ్‌

మహేష్‌, బన్నీ ఇద్దరికీ సూపర్‌హిట్‌ సెట్టింగ్‌

మొదట్నుంచీ అనుకుంటూ వున్నట్టే సంక్రాంతి సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం లేదు. మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న వస్తోంది. అల్లు అర్జున్‌ చిత్రం 'అల వైకుంఠపురములో'కి జనవరి 12 ముహూర్తం ఖాయమయింది. ఈ రెండు డేట్లూ ఇద్దరు హీరోలకీ హిట్‌ ఇచ్చిన డేట్లు కావడంతో ఫాన్స్‌ సెంటిమెంట్‌ పరంగా ఖుషీగా వున్నారు.

జనవరి 11నే మహేష్‌ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్‌ అయింది. జనవరి 12న అల్లు అర్జున్‌కి దేశముదురు వచ్చింది. నేనొక్కడినే కలిసి రాలేదు కానీ మహేష్‌కి సంక్రాంతి బాగానే కలసి వచ్చింది. ఒక్కడు, బిజినెస్‌మేన్‌ కూడా సంక్రాంతికే విడుదలై విజయం సాధించాయి. జనవరి 10 శుక్రవారం అయినా కానీ ఆ డేట్‌ పట్ల ఇరు వర్గాలు ఇష్టంగా లేరు.

మహేష్‌, అనిల్‌ సుంకరకి ఆ డేట్‌కి '1 నేనొక్కడినే' వచ్చింది. త్రివిక్రమ్‌ - హారిక హాసినికి అదే రోజున 'అజ్ఞాతవాసి' అనే అశనిపాతం తగిలింది. అందుకే శుక్రవారం పోయినా ఫర్వాలేదు కానీ ఆ డేట్‌ మాత్రం వద్దే వద్దని ఇరువురూ సేమ్‌ డేట్‌కి అయినా రావాలని ఫిక్స్‌ అయిపోయారు.

అయితే మొత్తానికి రాజీ పడి ఒక రోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు వస్తుండడంతో బయ్యర్లు కూడా రిలీఫ్‌ ఫీలవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English