గ్లామరస్ క్వీన్ మరో ఆఫర్ కొట్టేసింది!

తెలుగమ్మాయి డింపుల్ హయతి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది. వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన డింపుల్ ఆ తరువాత హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాలో డింపుల్ హయతి గ్లామర్ షోకి అందరూ ఫిదా అయ్యారు. అవసరానికి మించి మరీ ఎక్స్ పోజ్ చేసి యూత్ ని ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఒక హీరోయిన్ ప్రమోషన్స్ కోసం ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడం హాట్ టాపిక్ అయింది.

అయితే ఇప్పుడు తన గ్లామర్ తోనే మరిన్ని అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ. అందుతున్న సమాచారం ప్రకారం.. డింపుల్ హయతికి హీరోయిన్ గా మరో అవకాశం వచ్చింది. గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ రూపొందిస్తోన్న సినిమాలో డింపుల్ హయతిని హీరోయిన్ గా తీసుకున్నారట. 

రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందించనున్నారు. ప్రస్తుతం గోపీచంద్.. మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు.