‘వెంకీ మామ’ కోసం అతణ్ని అడిగింది అందుకా?

‘వెంకీ మామ’ కోసం అతణ్ని అడిగింది అందుకా?

ఈ శుక్రవారమే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘వెంకీ మామ’. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. సినిమా అంతిమ ఫలితం ఎలా ఉంటుందన్నది వీకెండ్ అయ్యాక కానీ ఒక అంచనాకు రాలేమేమో. మంచి కాంబినేషన్, అన్ని వనరులు కుదిరినా.. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలు సినిమా చూసిన వాళ్ల నుంచి వ్యక్తమయ్యాయి.

సురేష్ ప్రొడక్షన్స్ నమ్మకాన్ని అతను నిలబెట్టలేకపోయాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ సినిమాకు దర్శకుడిగా ఫస్ట్ ఛాయిస్ అయితే బాబీ కాదని ముందే వెల్లడైంది. ‘సోగ్గాడేే చిన్నినాయనా’తో దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ కురసాలకు ఈ సినిమాను అప్పగించాలని భావించాడు సురేష్. కానీ అతను ‘బంగార్రాజు’ పనిలో బిజీగా ఉండటంతో బాబీ వైపు చూడాల్సి వచ్చింది.

ఐతే కళ్యాణ్ కృష్ణ అయితే ఇంకాస్త మెరుగ్గా ఈ సినిమాను తీర్చిదిద్ది ఉండేవాడేమో అన్న ఫీలింగ్ ఇప్పుడు జనాలకు కలుగుతోంది. ఈ సినిమాను కళ్యాణ్‌కు అప్పగించాలని సురేష్ భావించడంలో ఆశ్చర్యం లేదు. అతడి తొలి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ బ్యాక్ డ్రాప్‌.. ‘వెంకీ మామ’కు దగ్గరగా ఉంటుంది. రెండూ పల్లెటూరి నేపథ్యంలో సాగుతాయి. కుటుంబ బంధాల నేపథ్యంలో కథలు నడుస్తాయి. రెండింట్లోనూ జాతకాల అంశం కీలకంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో ‘వెంకీ మామ’ను కళ్యాణ్‌కు అప్పగించాలని సురేష్ అనుకుని ఉండొచ్చు. ఈ రోజుల్లో పల్లెటూరి సినిమాల్ని సరిగ్గా నడిపించే.. ఆ బ్యాక్ డ్రాప్‌లో వినోదం పండించే దర్శకులు అరుదైపోయారు. ‘సోగ్గాడే..’తో తనలో ఆ టాలెంట్ ఉందని కళ్యాణ్ రుజువు చేసుకున్నాడు. అందుకే అతను కనుక ‘వెంకీ మామ’ను డైరెక్ట్ చేసి ఉంటే.. సినిమా ఇంకాస్త ఎంటర్టైనింగ్‌గా, కన్విన్సింగ్‌గా ఉండేదేమో అని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English