ర‌ష్మిక‌ను ఆడుకుంటున్న స‌రిలేరు టీం

ర‌ష్మిక‌ను ఆడుకుంటున్న స‌రిలేరు టీం

మ‌హేష్ బాబు స‌ర‌స‌న సినిమా అనేస‌రికి ర‌ష్మిక మంద‌న్నా ఎంతగా ఎగ్జైట్ అయిందో తెలిసిందే. ఆమెకు తెలుగులో అవ‌కాశం ఇచ్చిన‌ తొలి బ‌డా స్టార్ హీరో మ‌హేషే. ఐతే ఇంత‌కుముందు తెలుగులో ర‌ష్మిక న‌టించిన సినిమాల‌న్నింట్లోనూ ఆమెకు మంచి పాత్ర‌లు ప‌డ్డాయి. పెర్ఫామ్ చేసే స్కోప్ ద‌క్కింది. సినిమాలో ఆమె పాత్ర కీల‌కం.

కానీ స‌రిలేరు నీకెవ్వ‌రు అలాంటి అవ‌కాశం ఆమెకు ఇచ్చిన‌ట్లు లేదు. ఈ సినిమా అంతా మ‌హేష్ చుట్టూనే తిరిగేలా ఉంది. విజ‌య‌శాంతి ఉండ‌టంతో త‌ర్వాతి ప్ర‌యారిటీ ఆమెకే ఇచ్చిన‌ట్లున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ముందు నుంచి ఈ సినిమా ప్రోమోలు చూసినా.. అప్ డేట్స్ చూసినా.. ర‌ష్మిక‌కు అస‌లు ప్రాధాన్య‌మే క‌నిపించ‌డం లేదు.

ఇప్ప‌టికి రెండు టీజ‌ర్లు వ‌దిలితే వాటిలో ర‌ష్మిక‌కు చోటే ఇవ్వ‌లేదు. పోస్ట‌ర్ల‌లోనూ అంతే. రిలీజ్ చేసిన రెండు పాట‌ల విజువ‌ల్స్‌లో సైతం ర‌ష్మికకు స్థానం ద‌క్క‌లేదు. ఆమె క‌నిపించే పాట ఒక్క‌టైనా రిలీజ్ చేయ‌ట్లేదే అని ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు. ఇలాంటి టైంలో హీ ఈజ్ సో క్యూట్ అంటూ ఒక పాట తాలూకు ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

సోమ‌వారం దీని ఫుల్ సాంగ్ రిలీజ‌వుతోంది. ఈలోపు ర‌ష్మిక‌తో ఈ పాట‌పై టిక్ టాక్ వీడియో చేయించారు. ఆమె హుషారుగా స్టెప్పులేసింది ఈ వీడియోలో. ఐతే ర‌ష్మిక‌కు ఇప్ప‌టికే అస‌లు ప్ర‌యారిటీ ఇవ్వ‌ని చిత్ర బృందం.. మ‌రీ చీప్‌గా ఆమెతో టిక్ టాక్ వీడియోలో స్టెప్పులేయించి ప్రోమో వ‌ద‌ల‌డం ఏంటి.. ర‌ష్మిక స్థాయి హీరోయిన్‌కు ఇది అవ‌మాన‌మే అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు ప‌డుతున్నాయి. ఆమె అభిమానుల‌కు సైతం ఇది రుచించ‌డం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English