వర్మా.. వాళ్లకోసారి ఈ సినిమా చూపించవూ

వర్మా.. వాళ్లకోసారి ఈ సినిమా చూపించవూ

ఏదో ఒక వివాదాస్పద అంశం తీసుకుని సినిమా తీయడం.. దాని మీద వివాదాలు రాజేయడం.. పబ్లిసిటీ  చేసుకోవడం.. సినిమాకు క్రేజ్ తీసుకొచ్చి జనాల మీదికి వదిలేయడం.. సినిమా ఎంత చెత్తగా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్‌తో తాను సేఫ్ అయిపోవడం.. వెంటనే మరో సినిమా మీదికి వెళ్లిపోవడం.. ఇదీ రామ్ గోపాల్ వర్మ వరస.

తన ప్రతిభనంతా ట్వీట్లు వేయడానికి, డిబేట్లలో వాదించడానికి.. సినిమాకు పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్న వర్మ.. ఒక ఫిలిం మేకర్‌గా ఎంతగా దిగజారిపోయాడు అనడానికి ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ తాజా ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికే వర్మ ఎన్నో చెత్త సినిమాలు తీశాడు కానీ.. ఇది వాటన్నింట్లోకి నాసిరకంది అనడంలో మరో మాట లేదు. ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌కు భజన చేస్తూ ఆయన ప్రత్యర్థుల మీద సెటైర్లు వేసి సంబరపడిపోయాడు వర్మ ఈ సినిమాలో.

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’కు ఎంత బ్యాడ్ టాక్ ఉన్నా సరే.. తొలి రెండు రోజుల వసూళ్లతోనే అది బ్రేక్ ఈవెన్ అయిపోయేలా ఉంది. దీంతో ఈ సినిమా సంగతి పక్కన పెట్టేసి తర్వాతి చిత్రాన్ని ప్రమోట్ చేసుకునే పనిలో పడిపోయాాడు వర్మ. ఆయన నుంచి రానున్న కొత్త చిత్రం ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’. తాను ఎంతగానో ఆరాధించే బ్రూస్ లీకి ట్యిబ్యూట్‌గా ఈ సినిమా తీశానంటున్న వర్మ.. దీన్ని ఒక ఇంటర్నేషనల్ మూవీగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు.
ఈ రోజు ఈ సినిమా ఇంటర్నేషనల్ ట్రైలర్ లాంచ్ కోసం చైనాకు వెళ్లాడు వర్మ. ఇండియాలో వర్మకు ఇప్పుడున్న విలువ ఎలాంటిదో.. ఆయన పనితనం ఏ స్థాయికి పడిపోయిందో తెలిసిందే. ఆయన్ని ఇక్కడెవ్వరూ పట్టించుకోవడం లేదు. కానీ చైనీయులకు వర్మ ప్రస్తుత స్థాయి గురించి తెలియనట్లుంది. బ్రూస్ లీకి ట్రిబ్యూట్‌గా సినిమా అనేసరికి ఏదో ఊహించుకుంటున్నట్లున్నారు.

ఈయనకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. వర్మ కూడా ఈ కార్యక్రమం గురించి ఓ రేంజిలో చెప్పుకుంటున్నాడు. ఐతే నిన్ననే తన కొత్త సినిమా రిలీజైన నేపథ్యంలో దాన్నోసారి అక్కడి జనాలకు స్పెషల్ ప్రివ్యూ వేసి చూపిస్తే.. ఈయన స్థాయి ఏంటో తెలిసి ఘన సత్కారం చేస్తారంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తుండటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English