రాజశేఖర్ కూతురు.. కృష్ణవంశీతో?

రాజశేఖర్ కూతురు.. కృష్ణవంశీతో?

హీరోల కొడుకులు హీరోలవుతారు కానీ.. కూతుళ్లు హీరోయిన్లుగా మారడం తక్కువే. ఐతే గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మారుతోంది. సినీ ఫ్యామిలీల నుంచి అమ్మాయిలు కూడా తెరంగేట్రం చేస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ తన ఇద్దరు కూతుళ్లనూ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేశారు. పెద్దమ్మాయి శివాని కథానాయికగా పరిచయం కావాల్సిన తొలి సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

ఇప్పుడామెను మరో సినిమాతో రీలాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు రాజశేఖర్. మరోవైపు ఆయన చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ‘దొరసాని’ సినిమాతో ఆమె కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా ఆడలేదు కానీ.. శివాత్మిక నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. లుక్స్ యావరేజ్ అనిపించినా.. నటన విషయంలో మాత్రం శివాత్మిక స్కోర్ చేసింది.

ఆమె టాలెంటును గుర్తించి సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ‘నక్షత్రం’ డిజాస్టర్ అయ్యాక చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ.. మరాఠీ క్లాసిక్ ‘నట సామ్రాట్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రంగమార్తాండ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్రకు శివాత్మికను తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే శివాత్మిక షూటింగ్‌లో కూడా పాల్గొంటోందట.

కృష్ణవంశీ ట్రాక్ రికార్డు ఎంతగా దెబ్బ తిన్నప్పటికీ ఆర్టిస్టుల నుంచి చక్కటి నటన రాబట్టుకోవడంలో ఆయన టాలెంటే వేరు. అలాంటి దర్శకుడి చేతిలో పడటం శివాత్మికకు కలిసొచ్చేదే. మరాఠీలో నానా పటేకర్ చేసిన పాత్రను ప్రకాష్ రాజ్ ఇందులో చేస్తున్నారు. కృష్ణవంశీ ఎంతో కసిగా చేస్తున్న ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English