ఇది ఫ్లాప్‌ అయితే నా సినిమాలిక చూడొద్దు!

ఇది ఫ్లాప్‌ అయితే నా సినిమాలిక చూడొద్దు!

ఒక సినిమా నిరాశ పరిచిందంటే ఇక తన సినిమాలేవీ చూడొద్దని ఒక హీరో ప్రకటించాడంటే అతడికి ఆ సినిమాపై అచంచలమైన నమ్మకం అయినా ఉండి ఉండాలి. లేదా ఎలాగైనా ప్రేక్షకుల్ని తన సినిమా పట్ల ఆకర్షితుల్ని చేయాలన్న డెస్పరేషన్‌ అయినా ఉండాలి. ఈ రెండిట్లో సునీల్‌కి ఏది ఉందో తెలీదు కానీ ఇంతటి సంచనలమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చి షాకిచ్చాడు. భీమవరం బుల్లోడు చిత్రం తప్పకుండా హిట్‌ అవుతుందని సునీల్‌ అన్నాడు. ఈ చిత్రం కనుక నిరాశ పరిచినట్టయితే ఇక ఎప్పటికీ తన సినిమాలు చూడొద్దని కూడా సునీల్‌ పేర్కొన్నాడు. తన గత చిత్రం మిస్టర్‌ పెళ్లికొడుకు నిరాశపరచడంతో సునీల్‌ ఈ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తననుంచి ఆడియన్స్‌ ఆశించేది కామెడీ అని గ్రహించిన సునీల్‌ ఈసారి హీరోయిజం తగ్గించి కామెడీకి పెద్ద పీట వేసాడు. ఇందులో కామెడీ బ్రహ్మాండంగా ఉంటుందని, ఆద్యంతం నవ్వుకుంటారని సునీల్‌ చెబుతున్నాడు.

కలిసుందాం రా తర్వాత మరో హిట్‌ ఇచ్చి ఎరుగని ఉదయ్‌శంకర్‌ ఇప్పుడీ సినిమాతో అద్భుతాలేమి చేస్తాడులే అంటే... తప్పకుండా అతను మళ్లీ ఈ చిత్రంతో వెలుగులోకి వస్తాడని సునీల్‌ అంటున్నాడు. సురేష్‌బాబు చాలా కాలం తర్వాత తన బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం పట్ల మార్కెట్‌ వర్గాల్లో అంచనాలైతే బాగానే ఉన్నాయి. సునీల్‌ కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే భీమవరం బుల్లోడు డిజప్పాయింట్‌ చేయడనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు