అది అత్త.. అల్లుడు, ఇది నాన్న.. కొడుకు!

అది అత్త.. అల్లుడు, ఇది నాన్న.. కొడుకు!

త్రివిక్రమ్‌ మరోసారి తన సక్సెస్‌ ఫార్ములాని 'అల వైకుంఠపురములో' వాడేస్తున్నాడు. ఇండస్ట్రీ హిట్‌ అయిన అత్తారింటికి దారేది చిత్రంలో చిన్నప్పుడు దూరమయిన అత్త ఆచూకీ తెలుసుకుని వచ్చే మేనల్లుడిని చూపించాడు. 'అల వైకుంఠపురములో' అయితే చిన్నతనంలోనే నాన్నకి దూరమై వేరే తండ్రి దగ్గర పెరిగిన కొడుకు తన తండ్రి గురించి తెలిసి వైకుంఠపురానికి వెళ్లడం కథ. ఫార్ములా అదే కానీ ఈసారి త్రివిక్రమ్‌ పాత్రలని, బంధాలని మార్చాడు.

కానీ సన్నివేశాల తీరు చూస్తే అత్తారింటికి దారేది గుర్తుకు రాక మానదు. అత్తారింటికి దారేది మాదిరిగానే తండ్రి ఇంట్లోని పరిస్థితులు, ఆఫీస్‌లోని స్థితిగతులు చక్కదిద్ది వైకుంఠపురానికి వైభవం తీసుకొస్తాడు ఇందులోని కొడుకు. అ ఆ చిత్రంలో కూడా హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సిమిలర్‌ కథనే చూపించిన త్రివిక్రమ్‌ ఈసారి కూడా తన ఫార్ములా వర్కవుట్‌ అవుతుందని భావిస్తున్నాడు.

అయితే మధ్యలో అజ్ఞాతవాసి చిత్రానికి త్రివిక్రమ్‌ గాడి తప్పడం, అరవింద సమేత చిత్రంలో తన మార్కు కామెడీ లేకపోవడంతో ఈసారి ఫలితం ఎలా వుంటుందోననే అనుమానాలయితే లేకపోలేదు. కానీ అల్లు అర్జున్‌ ప్రతి దానినీ చాలా జాగ్రత్త తీసుకుని మరీ ఓకే చేస్తాడు కాబట్టి అజ్ఞాతవాసిలా మిస్‌ ఫైర్‌ అయ్యే ప్రమాదమయితే లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English