అల... అలా దాట వేసారేంటి చెప్మా?

అల... అలా దాట వేసారేంటి చెప్మా?

అల వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నామని ప్రకటించిన దగ్గర్నుంచి ప్రతి ప్రోమోలోను ఆ డేట్‌ మెన్షన్‌ చేస్తూ వచ్చారు. కానీ టీజర్‌లో మాత్రం సంక్రాంతి 2020 అని మాత్రమే వేసారు. ఒకే ఒక్కసారి డేట్‌ ప్రకటించిన తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'కి జనవరి 12 డేట్‌ని మళ్లీ స్ట్రెస్‌ చేయలేదు.

అల వైకుంఠపురములోకి కూడా ఇప్పుడు డేట్‌ లేకుండా టీజర్‌ రిలీజ్‌ చేయడంతో ఈ పోటీ మరోసారి రసవత్తరంగా మారింది. ఇరు వర్గాల వారు ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారని, సరిలేరు నీకెవ్వరు జనవరి 11న, అల వైకుంఠపురములో జనవరి 12న విడుదలవుతాయని ట్రేడ్‌లో మాట్లాడుతున్నారు.

కానీ ఇంతవరకు సరిలేరు నీకెవ్వరుకి జనవరి 11 అనేది అఫీషియల్‌గా అనౌన్స్‌ కాలేదు. ఇప్పుడు అల వైకుంఠపురములోకి కూడా జనవరి 12 డేట్‌ మిస్‌ అవడంతో ఈ రెండు చిత్రాల నడుమ ఎంత గ్యాప్‌ వుంటుందనేది ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ అయింది. ఇదిలావుంటే ఈ రెండు చిత్రాల మధ్య జరుగుతోన్న పోటీ టీజర్‌కి వస్తోన్న వ్యూస్‌, లైక్స్‌లో కూడా రిఫ్లెక్ట్‌ అవుతోంది. సరిలేరు నీకెవ్వరు టీజర్‌కి రికార్డ్‌ వ్యూస్‌ రాగా, వాటిని బ్రేక్‌ చేసే సత్తా తమకి వుందన్నట్టు రియల్‌ టైమ్‌ వ్యూస్‌ అప్‌డేట్స్‌ని మీడియాకి అదే పనిగా పంపిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English