క్లాస్ హీరోకు మాస్ ప‌రీక్ష.. ఆ రోజే

క్లాస్ హీరోకు మాస్ ప‌రీక్ష.. ఆ రోజే

టాలీవుడ్లో చూడ‌గానే ప‌క్కా క్లాస్ అనే ఫీలింగ్ క‌లిగించే హీరోల్లో నాగ‌శౌర్య ఒక‌డు. కెరీర్ ఆరంభం నుంచి అత‌ను ఎక్కువ‌గా ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లే చేశాడు. మ‌ధ్య‌లో జాదూగాడు అనే సినిమాలో మాస్ చొక్కా తొడుక్కునే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. అది అస్స‌లు సూట్ కాలేదు. ఇక అక్క‌డి నుంచి త‌న‌కు న‌ప్పే క్లాస్ పాత్ర‌లే చేస్తూ సాగిపోయాడు.

ఐతే ఇప్పుడు అత‌డికి మ‌ళ్లీ మాస్ మోజు పుట్టింది. సొంత బేన‌ర్లో ర‌మ‌ణ‌తేజ అనే కొత్త ద‌ర్శ‌కుడితో అశ్వ‌త్థామ అనే సినిమాను లైన్లో పెట్టాడు. ఈ సినిమా కోసం ఒక స్టంట్ చేస్తూ కాలు దెబ్బ తీసుకోవ‌డం.. జిమ్‌లో చిజిల్డ్ బాడీతో క‌నిపించిన‌పుడే ఇది మాస్ ట‌చ్ ఉన్న సినిమా అని అర్థ‌మైంది.

ఈ మ‌ధ్య రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌తో సినిమాపై మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. అమ్మాయిల‌పై యాసిడ్ దాడులు చేసే మృగాళ్ల‌పై పోరాడే కుర్రాడి పాత్ర‌ను చేస్తున్నాడు శౌర్య ఈ సినిమాలో. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఖ‌రారైంది. కొత్త ఏడాదిలో సంక్రాంతి సంద‌డి ముగిశాక వ‌చ్చే గ్యాప్‌లో త‌న సినిమాను రిలీజ్‌కు షెడ్యూల్ చేశాడు శౌర్య‌.

జ‌న‌వ‌రి 30న అశ్వ‌త్థామ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌కు జోడీగా మెహ్రీన్ పిర్జాదా న‌టిస్తుండ‌గా.. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించాడు. ఐరా క్రియేష‌న్స్ బేన‌ర్ మీద శౌర్య త‌ల్లి ఉషా మ‌ల్పూరి అశ్వ‌త్థామ చిత్రాన్ని నిర్మించింది. ఈ బేన‌ర్లో వ‌చ్చిన తొలి సినిమా ఛ‌లో సూప‌ర్ హిట్ కాగా.. రెండో చిత్రం న‌ర్త‌న‌శాల డిజాస్ట‌ర్ అయింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English