అమ్మ‌రాజ్యంలో.. డ్రామాకు తెర‌

అమ్మ‌రాజ్యంలో.. డ్రామాకు తెర‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన రాజ‌కీయ నాయ‌కులే పాత్ర‌ల స్ఫూర్తితో రామ్ గోపాల్ వ‌ర్మ తీసిన క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమాకు సంబంధించి గ‌త రెండు మూడు వారాలుగా ఎంత డ్రామా న‌డుస్తోందో తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ద‌గ్గ‌ర ఇబ్బందులు త‌లెత్త‌డం.. అనేక స‌న్నివేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డం.. వాళ్లు చెప్పిన మేర‌కు మార్పులు చేర్పులు చేసి టైటిల్‌ను కూడా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లుగా మార్చిన‌ప్ప‌టికీ విడుద‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం తెలిసిందే. చివ‌రికి డిసెంబ‌రు 12న‌, గురువారం సినిమా రిలీజ్‌కు మార్గం సుగ‌మ‌మైన‌ట్లే క‌నిపించ‌గా..  విడుద‌ల ఆగిపోతున్న‌ట్లుగా ముందు రోజు సాయంత్రం ఒక ప్ర‌చారం జ‌రిగింది.

వ‌ర్మ చెప్పిన‌ట్లుగా ఈ చిత్రానికి ముందే సెన్సార్ స‌ర్టిఫికెట్ రాలేద‌ని.. మ‌ళ్లీ సెన్సార్ బోర్డు ఏవో కొర్రీలు వేసింద‌ని.. గురువారం ఈ చిత్రం రిలీజ్ కాద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ డ్రామ‌కు కొన్ని గంట‌ల్లోనే తెర‌ప‌డింది. త‌న సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చిన‌ట్లుగా వ‌ర్మ ప్ర‌క‌టించాడు.

అమ్మ రాజ్యంలో క‌మ్మ రెడ్లు సినిమా విడుద‌ల‌ను ఆపేందుకు జ‌రిగిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయ‌ని.. ఈ చిత్రానికి సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని.. అనుకున్న‌ట్లే గురువారం సినిమా రిలీజ‌వుతోంద‌ని వ‌ర్మ ప్ర‌క‌టించాడు. సెన్సార్ స‌ర్టిఫికెట్‌ను కూడా ఆయ‌న షేర్ చేశారు. ఐతే గురువారం ఉద‌యం షోలు ప‌డే వ‌ర‌కు రిలీజ్ ప‌క్కా అనుకోవ‌డానికి లేద‌నే భావ‌న‌లో ఉన్నారు జ‌నాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English