చిరంజీవిపై మంచు మనోజ్‌ ఘాటు సెటైర్స్‌

చిరంజీవిపై మంచు మనోజ్‌ ఘాటు సెటైర్స్‌

 కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న నానా అవకతవకలకీ కొమ్ము కాస్తున్న చిరంజీవి తన అభిమానుల ఆగ్రహాన్ని కూడా చవి చూస్తున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అవలంబించిన తీరు సర్వత్రా విమర్శలకి గురవుతోంది. అయితే దీనిని సమర్ధిస్తూ నిలబడ్డ చిరంజీవి ఇప్పటికీ తన మంత్రి పదవిని పట్టుకు వేలాడుతున్నారు. అన్నిటికీ మించి ఇప్పుడు తనని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అందుకోసం రెడీ అన్నట్టు ఎదురు చూస్తున్నారు. అన్నయ్య తీరు పట్ల వీరాభిమానులే విసిగిపోతుంటే ఇక సగటు మనిషి ఎలా స్పందిస్తాడో చెప్పక్కర్లేదు. చిరంజీవి నిజంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తే మాత్రం ఇంతకాలం ఎదుర్కొన్న విమర్శలకి ఎన్నో రెట్లు ఘోరమైన సెటైర్స్‌ చవిచూడాల్సి వస్తుంది.

ఇదిలావుంటే మంచు మనోజ్‌ ట్విట్టర్‌లో 'ప్రజలు రిజెక్ట్‌ చేసినా టాప్‌ పొలిటీషియన్‌ కావడం ఎలా? ఒక వ్యక్తి సెంటర్‌లో కూర్చుని మన ప్రజలతో ఆడుతున్న గేమ్‌ని మనం టీవీలో చూస్తున్నట్టు చూస్తున్నాం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం' అంటూ ట్వీట్స్‌ వేసాడు. ఇవి చిరంజీవిని ఉద్ధేశించినవే అని అందరికీ అనిపిస్తోంది. కొందరు మెగా అభిమానులు మనోజ్‌పై విరుచుకుపడుతున్నారు కూడా. చిరంజీవి సీఎం అయితే ఇలాంటి సెటైర్లు డైరెక్టుగా వేసేవాళ్లు కోకొల్లలు ఉంటారు. సీఎం కావాలంటే ఆమాత్రం మూల్యం చెల్లించక తప్పదని చిరంజీవి భావిస్తుంటే మాత్రం ఏమీ అనలేం. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు