రష్మి నా లైఫ్-సుడిగాలి సుధీర్

రష్మి నా లైఫ్-సుడిగాలి సుధీర్

కమెడియన్ సుడిగాలి సుధీర్ పేరెత్తితే.. యాంకర్ కమ్ హీరోయిన్ రష్మి గుర్తుకొస్తుంది. అలాగే రష్మి పేరెత్తితే సుధీర్ గుర్తుకొస్తాడు. ఆ స్థాయిలో ఈ జోడీ ప్రాచుర్యం పొందింది. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ఎప్పుడూ ప్రచారం జరుగుతుంది. వీళ్లు కూడా అలాంటి సందేహాలు కలిగేలా ప్రవర్తిస్తుంటారు. కానీ అదంతా సరదాగానే సాగుతుందన్నది కూడా నిజం. ఐతే వాస్తవానికి తమ ఇద్దరి మధ్య ఏమీ లేదనే అంటుంటారు సుధీర్, రష్మి.

ఐతే తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో భాగంగా సుధీర్.. రష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె తన లైఫ్ అన్నాడు. అలా అని అపార్థం చేసుకోవద్దంటూ దీని వెనుక ఉన్న లాజిక్ గురించి చెప్పాడు సుధీర్. ''రష్మి నా లైఫ్. ఎందుకంటే సుధీర్ అనగాననే మొదట వచ్చే చర్చ రష్మి. జనాలు ఈ రోజు నా గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారంటే అందుకు కారణం రష్మినే. ఈ రకంగా ఆమెకు నేను రుణపడి ఉంటాను'' అని సుధీర్ చెప్పాడు.

ఇంతకీ రష్మిపై నీ అభిప్రాయమేంటి అని సుధీర్‌ను అడిగితే.. ''ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొని పైకి వచ్చింది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని విషయాలు తెలిసిన తర్వాత తనపై ఇష్టం కన్నా గౌరవం పెరిగింది'' అని చెప్పాడు. బయట అనుకుంటున్నట్లు తమ మధ్య ఏమీ లేదని.. తమది కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే అని.. తామిద్దరం ఏడేళ్లుగా జబర్దస్త్ ‌షోలో చేస్తున్నామని.. ఒకరి మీద ఒకరం పంచులు వేసుకోవడం.. ఏం మాట్లాడినా సరదాగా తీసుకోవడం అలవాటైందని సుధీర్ తెలిపాడు.

ఇక నాగబాబు బయటికి వెళ్లిపోయిన నేపథ్యంలో నువ్వు కూడా 'జబర్దస్త్' వదిలేస్తావా అని అడిగితే.. అలాంటిదేమీ లేదన్నాడు సుధీర్. బయటి నుంచి ఇంతకుముందు ఆఫర్లు వచ్చాయని.. ఇప్పుడూ వస్తాయని.. తనకు వెళ్లాలనిపించినా ఈటీవీ వాళ్లు వద్దంటే మాత్రం ఆగిపోతానని సుధీర్ స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English