మంచి సినిమాలాగే ఉంది.. కానీ నిలుస్తుందా?

మంచి సినిమాలాగే ఉంది.. కానీ నిలుస్తుందా?

'ఖాకి', 'ఖైదీ' సినిమాలతో ప్రేక్షకుల ఆదరణతో పాటు గౌరవం కూడా సంపాదించుకున్నాడు తమిళ యువ కథానాయకుడు కార్తి. అన్న సూర్య లాగే విభిన్నమైన సినిమాలతో సాగిపోతున్న అతను.. ఇప్పుడు అన్న కంటే మంచి ఫామ్‌లో ఉన్నాడు. 'దృశ్యం' లాంటి సెన్సేషనల్ మూవీ అందించిన జీతు జోసెఫ్ దర్శకత్వంలో అతను నటించిన కొత్త సినిమా 'దొంగ'. తాజాగా దీని ట్రైలర్ రిలీజైంది. అది చూస్తే కార్తి మరో హిట్టు కొట్టేలాగే కనిపిస్తున్నాడు.

ఒక భర్త, భార్య.. వాళ్లకో కూతురు, కొడుకు. ఐతే కొడుకు చిన్నపుడే తప్పిపోతాడు. మళ్లీ చాలా ఏళ్లకు పెద్దవాడిగా తిరిగొస్తాడు. ఆ కుటుంబానికి చాలా ఆస్తి ఉంటుంది. వాళ్లను కొన్ని సమస్యలూ వెంటాడుతుంటాయి. ఐతే తిరిగొచ్చిన వాడు అసలైనోడా కాదా అనే సందేహాలు ఉంటాయి. వాస్తవానికి తిరిగొచ్చిన వాడు ఒక దొంగ. అతను నిజంగా ఈ ఇంటి బిడ్డా.. లేక మోసం చేస్తున్నాడా అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి. ట్రైలర్లో లవ్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్ని రసాలూ కనిపించాయి.

ఎంటర్టైన్మెంట్‌తో పాటు మంచి ఎమోషన్లున్న సినిమాలా కనిపిస్తోంది 'దొంగ'. బ్యాక్ డ్రాప్ డిఫరెంటుగా ఉంది. కార్తి-జ్యోతిక-సత్యరాజ్‌ల పెర్ఫామెన్స్ సినిమాకు హైలైట్ అయ్యేలా ఉంది. కాకపోతే క్రిస్మస్ సీజన్లో తెలుగు సినిమాలకే చోటు కష్టమైన పరిస్థితుల్లో 'దొంగ'కు ఏమాత్రం థియేటర్లు దొరుకుతాయి.. దీన్ని మన ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారు అన్నదే సందేహం.

డిసెంబరు 20కి 'దొంగ' షెడ్యూల్ కాగా.. దాంతో పాటుగా వచ్చే 'ప్రతి రోజూ పండగే', 'రూలర్'.. ముందు వారం వచ్చే 'వెంకీ మామ', తర్వాతి వారం వచ్చే 'ఇద్దరి లోకం ఒకటే', 'మత్తు వదలరా' సినిమాల నుంచి పోటీని తట్టుకుని నిలవడం 'దొంగ'కు సవాలే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English