వైకుంఠపురములో.. ఆ బ్లాక్ పేలిపోతుందట

వైకుంఠపురములో.. ఆ బ్లాక్ పేలిపోతుందట

సంక్రాంతికి రాబోయే రెండు భారీ చిత్రాలు వేటికవే ప్రత్యేకం. రెంటిలోనూ ఆకర్షణలకు లోటేమీ లేదు. అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల క్రేజీ కలయికలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' మీద అయితే రోజు రోజుకూ అంచనాాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా త్రివిక్రమ్ శైలిలోనే ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని అంటున్నారు. ఇందులో కామెడీ ఓ రేంజిలో ఉంటుందని.. వింటేజ్ త్రివిక్రమ్‌ను గుర్తుకు తెస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా 'రౌడీ అల్లుడు'ను తలపించే కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. 'రౌడీ అల్లుడు'లో బొంబాయి నుంచి వచ్చే డమ్మీ చిరు ఇంకో చిరు ఆఫీసులోకి వచ్చి చేసే హంగామా అంతా ఇంతా కాదు. దాని స్ఫూర్తితో అలాంటి ఎపిసోడే ఒకటి త్రివిక్రమ్ 'అల వైకుంఠపురములో'లో పెట్టినట్లు ఇంతకుముందే సంకేతాలు వచ్చాయి.

ఇటీవలే రిలీజైన 'అల..' టీజర్ గ్లింప్స్‌లో బన్నీ 'రౌడీ అల్లుడు'ను తలపించే గెటప్‌లో ఆఫీస్ టేబుల్ మీద ఎక్కి నడుచుకుంటూ వెళ్లే సీన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కలిగించింది. సినిమాలో ఈ ట్రాక్ ప్రేక్షకుల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుందని.. చిరును బన్నీ ఇమిటేట్ చేయడం మెగా అభిమానుల్ని అలరిస్తుందని అంటున్నారు.

ఈ చిత్రంలో బన్నీ.. పవన్‌ను సైతం ఇమిటేట్ చేస్తాడని.. తద్వారా తనకు దూరమైన పవర్ స్టార్ అభిమానుల్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాడని సమాచారం. గతంలో వచ్చిన 'ఇంటిగుట్టు' అనే సినిమా ఆధారంగా 'అల..' సినిమాను త్రివిక్రమ్ తీర్చిదిద్దాడని.. గతంలో 'మైనా' స్ఫూర్తితో తీసిన 'అఆ' తరహాలోనే ఇది కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుందని అంటున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English