మహేష్‌కే అలా అంటే.. బన్నీతో ఇంకెలా అమ్మా

మహేష్‌కే అలా అంటే.. బన్నీతో ఇంకెలా అమ్మా

కన్నడ నుంచి తెలుగులోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అమ్మాయి రష్మిక మందన్నా. ముందు నాగశౌర్య, నాని, విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజి హీరోలతోనే నటించింది కానీ.. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తోంది. దీని తర్వాత ఆమె అల్లు అర్జున్‌తో జత కట్టనున్న సంగతి తెలిసిందే.

ఐతే 'సరిలేరు నీకెవ్వరు' త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమె దృష్టంతా ఈ చిత్రం మీదే ఉంది. ఈ సినిమా గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మహేష్ బాబు డ్యాన్స్ టాలెంట్ గురించి మాట్లాడింది రష్మిక. మహేష్ సూపర్ డ్యాన్సర్ అని.. అతణ్ని తాను మ్యాచ్ చేశానో లేదో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది రష్మిక.

ఐతే బేసిగ్గా మహేష్ బాబుకు అంత మంచి డ్యాన్సర్‌గా ఏమీ పేరు లేదు. 'బ్రహ్మోత్సవం' సహా కొన్ని సినిమాల్లో మహేష్ డ్యాన్సుల మీద ఎంతో ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ యాంటీ ఫ్యాన్స్ రష్మిక కామెంట్ల మీద కామెడీ చేయడం మొదలుపెట్టారు. మహేష్ డ్యాన్స్ వీడియోలు పెట్టి ఈయనతో డ్యాన్స్ గురించా భయపడ్డావ్.. మ్యాచ్ చేయడం గురించి మాట్లాడావ్ అంటూ రష్మికను ప్రశ్నిస్తున్నారు. అంతే కాక మహేష్ విషయంలోనే అంత భయపడితే.. ఈ తరంలో టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడైన అల్లు అర్జున్‌తో సినిమాలో ఇంకెంత టెన్షన్ పడిపోతావో.. అసలు అతడి ముందు నిలవగలవా అని ప్రశ్నిస్తున్నారు.

ఐతే ఇలా ట్రోల్ చేస్తున్న వాళ్లంతా మెగా ఫ్యాన్సే అన్న భావనతో మహేష్ అభిమానులు మెగా హీరోల్లో వీక్ డ్యాన్సర్ అయిన పవన్ కళ్యాన్ డ్యాన్స్ వీడియోలు బయటికి తీసి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English